చంద్రాల నుంచి గుడ్లవల్లేరు వరకు రూ. 4.37 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం…

-రూ.21.80 లక్షలతో ఆర్బీకే, రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంధ్రాలకు  ప్రారంభం… 
-రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశశిభూషణ్

గుడ్లవల్లేరు, చంద్రాల, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు ఆర్థికాభివృద్దే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేలను ఏర్పాటు చేసి రైతు సమస్యలను వారి గ్రామాల్లోనే పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టారని రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం చంద్రాల నుంచి గుడ్లవల్లేరు వరకు రూ. 4.37 లక్షలతో నిర్మించనున్న 6.8 కీ.మీ.నిడివిగల బీటీ రోడ్ కు స్థానిక నాయకులు, అధికారులతో కలసి శంకుస్థాపన చేసి అనంతరం గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన ఆర్బీకే,రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంధ్రాలకు ప్రారంభించారు. ఈ . సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్.రాజశేఖరరెడ్డి జన్మ దినోత్సవం సందర్భంగా రైతు దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమన్నారు. డా. వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గలా ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ, విద్యకు అధిక ప్రాధాన్యత నిచ్చారన్నారు. నేడు ఆయన కుమారుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తండ్రికి తగ్గ తనయుడిగా రైతు సంక్షేమమే లక్ష్యంగా నేడు రైతు నివశించే ప్రాంతల్లోనే ఆర్బీకేలు, ఆగ్రిటెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయంతో పాటు రైతు భరోసాగా ఆర్థిక సహాయాన్ని అందింస్తున్నారన్నారు. గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడి దూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకునే ఎరువులు, విత్తనాలు,పురుగు మందులు నేడు ఆర్బీకేల్లోనే రైతులకు అందుతున్నాయన్నారు. గ్రామ స్వరాజ్యం స్థాపించే దిశగా గ్రామాల్లోనే పాలనను అందించే విదంగా ఆర్బీకేలు, గ్రామ సచివాలయ వ్యవస్థను స్థాపించారు. దీనికి తోడు ప్రభుత్వం పధకాలు అర్హువైన లబ్దిదారులుకు వేగవంతంగా చేరేవిధంగా వాలంటరీ వ్యవస్థను స్థాపించారన్నారు. ఒక వైపు రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, తోడు, విద్యాదీవెన, వసతి దీవెన, ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలు అర్హువైన వారందరికీ అందిస్తున్నారు. మరో వైపు అభివృద్దే లక్ష్యంగా నాడు – నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు ఆధునీకీకరణ, రహదారుల నిర్మాణం వంటి చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. నేడు వాలంటీర వ్యవస్థ ద్వారా పెన్షన్ ఒకటవ తేదీ తెల్లవారక ముందు అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రాల ఆర్బీకే ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు అందజేసి, ఉత్తమ రైతు మదిర అంజియ్యను ఘనంగా సత్కరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి జయంతి పురష్కరించుకొని తొలుత అంగళూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్థానికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్దులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవశాయశాఖ ఏడీఏ పద్మజ, సీడీపీవోభానుశ్రీ, డాక్టరు బండారు శ్యామ్, తాహశీల్థారు ఆంజనేయులు, యంపీడీవో మణికుమార్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, సర్పంచ్ నిమ్మగడ్డ కుటుంబరావు,అంగళూరు సర్పంచి ఈడేపల్లి రవికుమార్, ఈఈలుపీవీ రమణరావు, శ్రీనివాస్,డీఈలు రవికుమార్, హరిబాబు, వివిధ శాఖల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *