విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ ఆవరణలో వై.సీ.పీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని డిప్యూటి మేయర్ బెలం దుర్గ మరియు పలువురు కార్పొరేటర్లతో కలసి భారీ కేక్ కట్ చేసి మంత్రి బొత్సకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంలో ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ మాట్లాడుతూ నగరాభివృద్దికి భారిగా నిధులు కెటాయించినందుకు నగర పాలక సంస్థ తరుపున మంత్రి బొత్స సత్యనారాయణకు కృతజ్ఙతలు తెలిపారు. అదే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని, అయన సహాకారంతో భవిష్యత్‌లో నగరాన్ని మరింత అభివృద్ది చేసామని తెలిపారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …