మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం తమ కార్యాలయమునకు వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తమ సిబ్బందిని ఆదేశించారు. ఆర్ టిసి సంస్థలో పని చేసి ఆనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ పలువురు మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఆర్ టిసిలలో కారుణ్య నియామకాలలో చనిపోయిన వారి పిల్లలకు న్యాయం చేస్తున్నారని అదే మాదిరిగా మెడికల్ అన్ ఫిట్ అయిన వారి విషయంలో కూడా తగిన న్యాయం చేయాలని జె. సుగుణాకర్ తదితరులు మంత్రిని కోరారు. వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయించాలని కొందరు, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మరి కొందరు, అనారోగ్యంతో బాధ పడుతున్న తమ వారికి మెరుగైన వైద్యం ఇప్పించాలని మరి కొందరు మంత్రికి వినతులు సమర్పించారు.
Tags machilipatnam
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …