Breaking News

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

తూర్పు-పశ్చిమ షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km మధ్య ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది .

ఒడిస్సా తీరము & దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టము నుండి 2.1 km & 3.6 km ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

పైన తెలిపిన ఉపరితల ఆవర్తనం వలన ఉత్తర ఆంధ్ర ప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో రేపు (11.07.2021) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ నుండి అతిభారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
తీరం వెంబడి 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ నుండి అతిభారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
తీరం వెంబడి 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ నుండి అతిభారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
తీరం వెంబడి 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ నుండి అతిభారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
తీరం వెంబడి 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :
ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

Check Also

నగరంలో బిఎస్‌పి గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బిఎస్‌పి గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభమైంది. స్థానిక జైహింద్‌ కాంప్లెక్స్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *