తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పొందినట్లు ధ్రువపత్రం, ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 5 వేల మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
