-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ నెల NTR భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ ల పంపిణీ జిల్లాలో 2,65,488 మందికి సుమారు రూ.112.37 కోట్లు పంపిణీ నవంబర్ 1వ తేదీన చేయనున్నట్లు తెలుపుతూ, వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వృద్దాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, HIV వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు రూ.3,000/- ల నుండి రూ.4,000/- వరకు పెంచడమైనది. అలాగే వికలాంగుల పెన్షన్ లు రూ.3,000/- ల నుండి రూ.6,000/- వరకు పెంచడమైనది. DMHO పెన్షన్ లు రూ.5,000/- ల నుండి రూ.10,000/- వరకు పెంచడమైనది. ఇందులో శాశ్వత వికలాంగులకు రూ.5,000/- ల నుండి రూ.15,000/- వరకు పెంచడమైనది.
సదరు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను నవంబర్ 1 వ తేదీన ఉదయం.6 గం.ల నుండే లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి సచివాలయం సిబ్బంది పంపిణి చేస్తారని, నవంబర్ 1న మరియు 2వ తేదీలలో మాత్రమే పంపిణి చేస్తారని తెలిపారు. కావున పెన్షన్ లబ్ధిదారులు అందరూ నవంబర్ 1 వ తేదీననే తమ ఇంటి వద్ద అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని , బయట గ్రామాలకు వెళ్ళినవారు కూడా 1 వ తేదీన గ్రామాలలో వుండి పెన్షన్ తీసుకొనవలెనని కోరారు. ఏదేని కారణం చేతనైన 1వ తేదీన తీసుకోలేని వారు 2 వ తేదీన తప్పక అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని కోరారు. పెన్షన్ లబ్దిదారులు ఎవ్వరు కూడా సచివాలయ కార్యాలయానికి పెన్షన్ కొరకు రావలసిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు.