-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి విద్యార్థి చదువుకుని ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు.
బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్షా, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ‘యూనిసెఫ్ కెరీర్ సర్టిఫికేట్ కోర్సు రూపకల్పన’ వర్క్ షాపు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రేరణ, భవిష్యత్ ప్రాధాన్యతను ఇవ్వడం లక్ష్యంగానే ఉపాధ్యాయులకు తెలుగులో కెరీర్ సర్టిఫికేట్ కోర్సు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువులో భాగంగా తమ జీవిత లక్ష్యాలను ఎంచుకోవడానికి, ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయడానికి ఈ కోర్సు వినియోగపడుతుందని, తద్వారా తమ జీవిత లక్ష్యాలను చేరుకునే మార్గం సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆస్తకులను దృష్టిలో ఉంచుకొని సంబంధించిన అంశాలపై మొగ్గు చూపేలా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన పరచేలా కోర్సు రూపకల్పన చేయాలని విషయనిపుణలకు సూచించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి, దీక్షా కో ఆర్డినేటర్ డాక్టర్ ఇస్మాయిల్, యూనిసెఫ్ ప్రతినిధులు బి.ప్రియాంక, టి.సుదరర్శన్, స్వాతి, విషయ నిపుణులు, విద్యా సలహాదారులు, ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్షా, యూనిసెఫ్ సిబ్బంది పాల్గొన్నారు.