-డిఆర్ఓ నరసింహులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే శాఖ పై ఆన్ ది స్పాట్ స్టడి టూర్ నిమిత్తం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాకు విచ్చేయనున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. రైల్వే శాఖ పై స్టడి టూర్ నిమిత్తం ఈ నెల 3 వ తేది తిరుపతి జిల్లాకు చేరుకుంటున్న ఎం.పి రమేష్ సారథ్యంలో వస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం ఉండరాదని డిఆర్ఓ నరసింహులు అధికారులకు సూచించారు.
నేటి శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని విసి హాల్ నందు సదరు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటనకు సంబంధించిన సమన్వయ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించి వారు మాట్లాడుతూ రైల్వే శాఖ పై ఆన్ ది స్పాట్ స్టడి టూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎంపీల బృందం దురంతో ఎక్స్ప్రెస్ లో ఆదివారం సాయంత్రం 4.40 గం.లకు ఈ నెల 3 వ తేదిన రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకుని రాత్రి తిరుపతి తాజ్ హోటల్ నందు బస చేయనున్నారని తెలిపారు. 4 వ తేదిన ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం గారితో తాజ్ హోటల్ నందు సమావేశమై ప్రజలకు రైల్వే స్టేషన్ల నందు మెరుగైన సదుపాయాల కల్పనపై చర్చించి, మధ్యాహ్నం 3 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుని రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై ఆన్ ది స్పాట్ విజిట్ చేసి సందర్శించి స్టేషన్ డైరెక్టర్ తదితర అధికారులతో సమీక్షించి రాత్రి 7.45 గంలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం కానున్నారని, ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం లేకుండా పగడ్బంధీగా ఉండాలని డి.ఆర్. ఓ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ తిరుపతి రామ్మోహన్, డిఎంహెచ్ఓ శ్రీహరి, సూపరింటెండెంట్ రుయా ఆసుపత్రి రవి ప్రభు, డిసిహెచ్ఎస్ ఆనందమూర్తి ప్రోటోకాల్ తహసీల్దార్ కుప్పయ్య, రైల్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News