-జిల్లాలో 2,65,488 మంది లబ్దిదారులకు సుమారు రూ.112.37 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం 6గం.ల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో 2,65,488 మందికి 5295 మంది సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.37 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం వృద్దాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, HIV వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు రూ.3,000/- ల నుండి రూ.4,000/- వరకు పెంచడమైనది. అలాగే వికలాంగుల పెన్షన్ లు రూ.3,000/- ల నుండి రూ.6,000/- వరకు పెంచడమైనది. DMHO పెన్షన్ లు రూ.5,000/- ల నుండి రూ.10,000/- వరకు పెంచడమైనది. ఇందులో శాశ్వత వికలాంగులకు రూ.5,000/- ల నుండి రూ.15,000/- వరకు పెంచడం జరిగిందని అందులో భాగంగా ప్రతి నెలా 1 వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజల ఇంటి వద్దకే పించన్ పంపిణీ చేయడం జరుగుతోందని అధికారులు బాగా పనిచేశారని తెలిపారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని లబ్ధిదారులకు నేడు వంద శాతం పించన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా పించన్ అందుకున్న లబ్దిదారులు 1 వ తేదీన క్రమం తప్పకుండా పించన్ అందుతోందని ఆలస్యం లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
నేడు పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే లు, ప్రజా ప్రతినిధులు సచివాలయం సిబ్బందితో కలిసి ఉదయం నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2,65,488 మంది లబ్దిదారులకు సుమారు రూ.112.37 కోట్లు పంపిణీకి చర్యలు చేపట్టామని అన్నారు. ఏదేని కారణం చేత పెన్షన్ల నేడు తీసుకోలేని వారికి నవంబర్ 2 వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని, తప్పకుండా వారు వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News