Breaking News

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, డి ఎస్పీ రేణిగుంట శ్రీనివాసులు, డిఎం సివిల్ సప్లైస్ సుమతి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజు, ఇంఛార్జి తాసిల్దార్ రేణిగుంట శ్యామ్ ప్రసాద్, ప్రజా ప్రతినిధులు తదితరులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్థానిక చెన్నారెడ్డి కాలనీ మునిసిపల్ ప్రైమరీ స్కూల్ నందు దీపం 2.ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బయల్దేరి వెళ్ళారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *