-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి పై దృష్టి సాధించిందని ఇందులో భాగంగా నిత్యం రద్దిగా ఉండే రహదారులను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టిందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) తెలియజేశారు. శనివారం ఉదయం “మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ” కార్యక్రమం కంబాల చెరువు దగ్గర దండీ మార్చ్ వద్ద నుండి శాసన సభ్యులు ఆదిరెడ్డి వారు స్థానికనాయకులు, అధికారులతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నిత్యం వాహనాలతో రద్దీగా ఉండి, భారీ వర్షాల వలన గుంతలు ఏర్పడిన రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయకపోతే వాహన చోదకులు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు, వారి సంక్షేమం దృష్ట్యా కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరం నియోజకవర్గ పరిధిలో ఎక్కడా కూడా రహదారులు గుంతలు లేకుండా ఉంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ఇటువంటి సమస్యపై దృష్టి సారించలేదని, దీనివలన వాహన చోదకులు ప్రణాలను కోల్పోయి వారి కుటుంబాలు వీధిన పడే దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలువలోనే రోడ్ల పైన ఎక్కడ గుంతలు, ఎత్తు పల్లాలతో అధ్వానంగా ఉన్నాయో వాటిని గుర్తించి వాటి మరమ్మత్తుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగా ముందుకు వెళుతున్నామని శాసనసభ్యులు అన్నారు. ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి ప్రజానీకానికి ఏ విధంగా మేలు చేయాలని సదుద్దేశంతోనే ఉన్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులుకాశి నవీన్ కుమార్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News