Breaking News

ప్రేమ స్వరూపులారా సర్వత్ర నిండినది దైవమే అని తెలిపినది శ్రీ భగవాన్ సత్యసాయి బాబా

-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ పట్టణం రైతుపేట శ్రీ భగవాన్ సత్యసాయి నగర్ శ్రీ భగవాన్ సత్యసాయి మందిరం నందు జిల్లా అందత్వ నివారణే లక్ష్యముగా శంకర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా కమిటీ సభ్యులు భక్తులు మరియు కూటమినేతలతో కలిసి ప్రారంభించిన శాసనసభ్యులు  తంగిరాల సౌమ్య. అనంతరం మాట్లాడుతూ మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడి అనాదిగా మనకు తెలిసిన విషయమే పేద సామాన్య ప్రజానీకానికి అత్యంత చేరువుగా ఉంటూ దేశవ్యాప్తంగా దేశం నలుమూలల ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి మరెన్నో ఉచిత వైద్య శిబిరాలను నడుపుతున్న శ్రీ భగవాన్ సత్యసాయి కమిటీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా  నీలో నుండి దుర్గుణాలను వదిలి నీతో ఉన్న సద్గుణంతో మానవళి అంతటా నీ మానవత్వాన్ని చాటుకోమని తెలియజేశారని ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య గుర్తు చేశారు. ఇంతటి మంచి కార్యక్రమానికి ముందుకు విచ్చేసి సేవలను అందిస్తున్న ప్రతి ఒక్కరిని పేరుపేరునా ప్రత్యేకంగా అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *