రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. ఆం.ప్ర రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వర్యులు వి.అనిత గారికి చిత్తూరు ఎంపీ దగ్గమళ్ళ ప్రసాద రావు, ఎస్పి ఎల్. సుబ్బ రాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్, ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం గౌ. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి వడమాల పేట మండలం ఎఎం పురం గ్రామానికి చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబీకులను పరామర్శించడానికి మరియు ప్రభుత్వం తరపున 10 లక్షల ఆర్థిక సాయం అందించడానికి బయల్దేరి వెళ్ళారు.
Prajavartha Online Telugu News