-ముఖ్య అతిథిగా హాజరవుతోన్న హోంమంత్రి అనిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టూ మేన్ కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Prajavartha Online Telugu News