Breaking News

కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో పలు అంశాలు ప్రస్తావించిన ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి హాజరైన రాష్ట్ర బిజెపి అధ్యక్షు రాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సదస్సులో చర్చిస్తున్న అంశాల పట్ల ఆనందం వ్యక్తంచేసారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉంది. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మహిళా సాధికారత కోసం మన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో చేపడుతున్న సానుకూల, ఖచ్చితమైన అంశాలను సవివరంగా వివరించడానికి ఈ సదస్సు ద్వారా మంచి అవకాశం దొరికింది” అని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. 8వ తేదీ వరకు కాన్ఫరెన్స్ చర్చల్లో పాల్గొని, 11వ తేదీన స్వదేశానికి ఆమె తిరిగి వస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *