-ఉత్తర్వులు జారీ చేసిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి .ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే ) జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి, ఎం. శ్రీరామమూర్తి, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె . పార్థసారధిలు జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతిని కలిసి ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ 50% కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల కోరడం జరిగింది.
జర్నలిస్టుల వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఇందుకు సంబంధించిన సర్కులర్ జారీ చేశారు. 2024-2025 విద్యా సంవత్సరంలో ఈ ఉత్తర్వులు అమలయ్యేలా జిల్లా పాఠశాల విద్యాధికారి, డిప్యూటీ విద్యాధికారులు, ఆఫీసర్, మండల విద్యాధికారు లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ సర్కులర్ లో జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది.
Prajavartha Online Telugu News