-యంపీడీవో వెంకట రమణ
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల్లో భాగంగా “పెద లందరికి ఇళ్ళు” కార్యక్రమము లో ఎంపిక చేయబడిన లబ్ధిదారులను జియో టాగింగ్ ప్రక్రియను పూర్తి చేసి త్వరిత గతిన ఆన్ లైన్ లో పొందు పర్చాలని యంపీడీవో ఏ వెంకటరమణ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలానికి సంబందించి సచివాలయ సెక్రటరీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లుతో హౌసింగ్, కరోనా నియంత్రణ అంశాల పై సమీక్షించారు. ఈ సందర్బం యంపీడీవో మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో కోవిడ్ నిబంధనలపై సర్వైలైన్సు బృందాలు తమ పరిధిలో గల గ్రామాల్లో కోవిడ్ -19 లో భాగముగా నోమాస్క – నో ఎంట్రి , నోమాస్క – నో రైడ్, నోమాస్క- సేల్ పై ప్రజల్లో అవగాహన కల్పించే విదంగా చర్యలు చేపట్టాలన్నారు. మొదటి దశలో ఎంపికైన జగనన్న ఇళ్లు నిర్మాణాలకు సంబందించి ఇంకా లబ్దిదారుల ఇళ్లకు సంబందించి పూర్తి కాని జియో టాగింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి త్వరిత గతిన యాప్ లో అప్లోడ్ చెయ్యాలన్నారు. సమావేశంలో హౌసింగ్ డీఈ రామోజీనాయక్, పంచాయితీ సెక్రటరీలు, వెల్పేర్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వైలైన్సు టీమ్ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.