Breaking News

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల వేదికని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. నగరపాలక సంస్థ సంబంధిత వివిధ సమస్యలను ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫిర్యాదులు దరఖాస్తు చేసుకోగలరని కమిషనర్ కోరారు. ప్రతి సోమవారం లాగానే ఈ సోమవారం కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ తో సహా, జోనల్ కార్యాలయాల్లో కూడా నిర్వహిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు నగరపాలక సంబంధిత ఫిర్యాదులను జోనల్ లేదా ప్రధాన కార్యాలయంలో తమ ఫిర్యాదులు తెలుపవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *