Breaking News

ఇసుక తవ్వకాల చెల్లింపులు నేరుగా బోట్స్ మ్యాన్ సొసైటి లకి జమ

-ఎంప్యానల్, రిజిస్టర్డు బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకి శిక్షణా కార్యక్రమం
-జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక సరఫరా విధానం లో ఎంపనల్డ్ అయి గుర్తింపు పొందిన, రిజిస్టర్ బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు ఎంతో బాధ్యతతో కూడి వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక రాజమండ్రీ ఆర్డీవో కార్యాలయం లో సుమారు ఇసుక లావాదేవీలు పై ప్రభుత్వ మార్గదర్శకాలు, చెయ్యవలసిన, చెయ్యకూడని కార్యకలాపాలు తదితర అంశాలపై 90 మంది బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ, నిర్మాణ పనులకు ఎటువంటి అంతరాయం కలగకుండా వినియోగదారులకు ఇసుకను విరివిగా అందించడంలో బోట్స్ మెన్స్ సొసైటి లు మరింత గా ఇసుక తవ్వకాలను చేపట్టాల్సి ఉందన్నారు. బోట్స్ మెన్స్ సొసైటి లకు చెల్లింపుల సమస్య ఇకపై ఉండదని నేరుగా సొసైటీల బ్యాంకు ఖాతాలకు ఇకపై త్రవ్వకాల చెల్లింపు నేరుగా జరపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఆయా సొసైటీలు క్యూ ఆర్ కోడ్ తో కూడిన బ్యాంకు ఖాతాల నెంబర్ల స్కానర్ ను రిచ్ పాయింట్స్ వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. వినియోగదారులకు పూర్తిస్థాయిలో ఇసుక నానిబడ్డవంచేందుకు మరి ఎంతమంది తో కలసి ఇసుక త్రవ్వకాలను చేపట్టాలన్నారు. కనీసం ప్రతి రీచ్ లో 1000 నుంచి 2000 మెట్రిక్ టన్నులు ఇసుక త్రవ్వకాలు జరపాల్సి ఉంటుందన్నారు. ఇసుక సరఫరా,, లావాదేవీలు విషయంలో సాంకేతిపర మైన అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవాలని, నేరుగా సొసైటీల ఖాతాలకి డబ్బు చెల్లింపు జరుపుతున్న దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయ్యాలని పేర్కోన్నారు. రీచ్ లా వద్ద క్యూలైన్లో పాటింపు, రికార్డులు నిర్వహణా, లోడింగ్, పర్యవేక్షణా వంటి వాటి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ సూచనలను ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ ద్వారా ఇసుక ఒపెన్ రిచ్ పాయింట్స్ వద్ద ఉచిత ఇసుక అందుబాటులొ ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు. పరిపాలన, త్రవ్వకాలు, వాటిపై జి ఎస్ టి మాత్రం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిచ్ వారీగా బోస్ మెయిన్స్ సొసైటీకి చెల్లించాల్సిన రేట్ చార్టు లను ప్రముఖంగా ప్రదర్శించాలని తెలిపారు. డేటా ఎంట్రీ తదితర అంశాలపై అనుమానాలను నివృత్తి చెయ్యడం జరిగింది. రెండు షిఫ్ట్ లలో సిబ్బందిని నియమించి త్రవ్వకాలు చెయ్యడం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జెసి తెలిపారు. ట్రాక్టర్ ద్వారా ఇసుక త్రవ్వకాలు కోసం ఓపెన్ రిచ్ లకు వొచ్చే వారికి ఎటువంటి ఆటంకం కలిగించరాదని విజ్ఞప్తి చేశారు. అనధికార లోడింగ్ చేసినా, అనుమతులు లేని, సరైనా గుర్తింపు పత్రాలు లేని వాహనాలను రిచ్ పాయింట్స్ ఓపెన్, డి సిల్టేషన్ వద్ద అనుమతించరాదని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, రాజమండ్రి ఆర్డీవో ఆర్ . కృష్ణ నాయక్ కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, మెన్స్ అధికారి విగ్నేష్ బోట్స్ మ్యాన్ సొసైటీల సభ్యులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *