అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను నూతనంగా నియమితులైన ఏపీ ఖాదీ మరియు విలేజ్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఖాదీ బోర్డు చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ తో పాటు మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కేకే చౌదరి ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సవితను దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం ఖాదీ బోర్డు ఆధ్వర్యంతో అమలవుతున్న పథకాల గురించి ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News