Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన జుజ్జూరు గ్రామ‌స్తులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ‌ నియోజ‌క‌వ‌ర్గం వీరుల‌పాడు మండ‌లానికి చెందిన జుజ్జూరు గ్రామ‌స్తులు త‌మ గ్రామ అభివృద్ధి కోసం ఆదివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు. జుజ్జూరు గ్రామంలోని హిందూ స‌న్మాన‌వాటిక‌, డొంక రోడ్లు, అభివృద్ది చేయాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ను కోరారు. గ్రామ‌స్తుల స‌మ‌స్య‌ల‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ‌పార్టీ ప్రెసిడెంట్ మాదాల కోటేశ్వ‌రరావు, వైస్ ప్రెసిడెంట్ ప‌సుపులేటి సాయిబాబు, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు ఎస్.కె.జానీ,కోడెల కుటుంబ‌రావు, టిడిపి నాయ‌కులు కాపా రాంబాబు, బిసి నాయ‌కులు త‌మ్మిశెట్టి ఏడుకొండ‌లు, జ‌న‌సేనపార్టీ గ్రామ నాయ‌కులు ప‌సుపులేటి వ‌ర‌కుమార్, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి దేవ‌ర‌కొండ శ్రీనివాస‌రావుల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *