తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 13 మరియు 14 తేదీలలో పలువురు ప్రముఖులు పర్యటించ నున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి నల్లు ఈనెల 13న సాయంత్రం హైదరాబాదు విమానాశ్రయం నుండి బయలుదేరి 7. 30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం 8 గంటలకు తిరుపతి ఖాదీ కాలనీ నందు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ని కలుస్తారు. అనంతరం 9:30 గంటలకు తిరుమల బయలుదేరి వెళ్తారు. 14వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ తిరిగి ప్రయాణం కానున్నారు. హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి 1.10 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని తిరుపతిలో బస చేస్తారు. ఈనెల 15న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Tags tirupathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News