Breaking News

నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన షెల్టర్ హోమ్స్ నిర్వహణపై పరిశీలన

-షెటర్ హోమ్స్ లో ఉంటున్న వారితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కమిషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన షెల్టర్ హోమ్స్ నిర్వహణపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం రాణి తోట, హనుమాన్ పేట, గవర్నర్ పేట, చిట్టి నగర్ ప్రాంతాలలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

షెల్టర్ హోమ్స్ లో ప్రస్తుతం ఉన్న భోజన, మరుగుదొడ్లు, మెడికల్ క్యాంప్స్,పడక వసతులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎవరెవరు వస్తున్నారు వంటి అంశాలపై వారితో స్వయంగా మాట్లాడి, అక్కడ కనిపిస్తున్న వసతులు, వారి వివరాలు తెలుసుకున్నారు.

షెల్టర్ హోమ్స్ లో ఉన్న ప్రతి రూము, మరుగుదొడ్లు, నీటి సరఫరాను కమిషనర్ పరిశీలించారు. రాణి గారి తోట లో ఉన్న షెల్టర్ హోమ్ లో మరుగుదొడ్లు పాడైపోవడం గమనించి త్వరితగతిన మరుగుదొడ్లను యుసిడి వారి అనుసంధానంతో మరమతులు చేయాలని, భవనం పాత పడిపోవటం చూసి వెంటనే రంగులు వేయించాలని అధికారులను ఆదేశించారు.

షెల్టర్ హోమ్స్ లో నివసిస్తున్న నిరాశ్రయులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కారణం వల్ల నిరాశ్రయులయ్యారు? ఎప్పటినుండి ఉంటున్నారు? వారికి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి అంశాలను యుసిడి విభాగం వారిని తెలుసుకొని నివేదికని సమర్పించమన్నారు.

గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందడం కోసం వచ్చే ప్రజలు,వారి కుటుంబ సభ్యులకు చికిత్స పొందే వరకు కుటుంబ సభ్యులు ఉండుటకు ఆశ్రయం కల్పించే విధంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నూతన షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసేటట్టు చర్యలు తీసుకోమనే అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం వారి నేషనల్ అర్బన్ లైవ్ హెడ్ మిషన్ 2.0 పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా ఇతర ప్రదేశాల నుండి పని కోసం వచ్చే నిరాశ్రయులుగా ఉండే వర్కర్లకు లేబర్ చౌక్ల కోసం లేబర్ డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో సంయుక్త పరిశీలన చేసి లేబర్ చౌక్ ఏర్పాటు చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

ఎన్ యు ఎల్ ఏం 2.0 పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసే షెల్టర్ హోమ్స్ లో నిరుపేదల జీవన ఉపాధి కోసం ఒకటి సిటీ లైవ్లీహుడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసేటట్టు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి ) వెంకటనారాయణ, ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్లు పి. సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. సామ్రాజ్యం, యు సి డి టెక్నికల్ ఎక్స్పర్ట్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *