విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద శుక్రవారం ఉదయం భగవాన్ బిర్స ముండా 150 వ జయంతి వేడుకలను నగర కమిషన్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, కార్పొరేషన్ సిబ్బందితో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ బిర్సా ముండా భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడని, జానపద నాయకుడని, ముండా జాతికి చెందినవార ని, 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారని, 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారని, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారని, అతని గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో చిత్రపటం ఉందని, ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా అని తెలిపారు.
బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం పాతికేళ్లు కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్టమైనదని, బిర్సా ముండా గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారని తెలిపారు. ఇటువంటి విషయాలు యువత తెలుసుకోవడం ఎంతో అవసరమని, బిర్స ముండా వర్ధంతి సందర్భంగా భావిభారత పౌరులుగా అందరికీ ఇటువంటి మహనీయుల గొప్పతనం తెలియాలని తెలిపారు.
ఈ వేడుకల్లో అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ, జాన్ డైరెక్టర్ (అమృత్) డాక్టర్ లతా, మేనేజర్ ఏ యు బి శర్మ, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News