గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు ఉండాలని, ర్యాంపులతో డ్రైన్లు ఆక్రమించకుండా చూడాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం రోజువారి పర్యటనలో భాగంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు తనిఖీల నిమిత్తం శ్యామల నగర్, బృందావన్ గార్డెన్స్, రెడ్డిపాలెం ప్రాంతాలలో పర్యటించి, నిబంధనల ప్రకారం అనుమతించిన భవన నిర్మాణాలు ఉన్నది లేనిది ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అపార్ట్మెంట్ల వద్ద ర్యాంపులు డ్రైన్లు మరియు రోడ్లు పైకి ఉండుట గమనించి, వెంటనే ర్యాంపులు తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అనతరం పర్యటనలో భాగంగా గుజ్జనగుండ్ల సెంటర్ నుండి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు తొలగించిన వీధి వ్యాపారులు మరియు పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పర్యటించి, ట్రాఫిక్ అనంతరాయం కలుగకుండా వెడింగ్ హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
గుజ్జనగుండ్ల జంక్షన్ నందు తొలగించిన తోపుడు బండ్ల వీధి వ్యాపారులకు హాకర్ వెండింగ్ జోన్స్ 3 రోజుల్లో వీధి వ్యాపారదారులకు ప్రత్యేకంగా స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని, ప్రతి ఒక్క వీధి వ్యాపారి రోడ్లు మరియు డ్రైన్లు అక్రమించకుండా సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ప్రణాళిక అధికారులు మార్కింగ్ వేయాలని, ఇంజనీరింగ్ అధికారులు ప్లాట్ ఫారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సదరు పర్యటనలో కార్పొరేటర్ మానం పద్మశ్రీ , సిటీ ప్లానర్ రాంబాబు, ఎ.సి.పి రహమాన్, టి.పి.యస్ సత్యనారాయణ, డి.ఈ.ఈ లు, ఎ.ఈ లు , బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News