Breaking News

బ్యాంకర్లతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో డి. సి. పి. గౌతమి షాలి ఐ. పి. ఎస్., క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు మరియు వారి సిబ్బందితో కలిసి పోలీస్ కమీషనరేట్ పరిదిలో డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలను అరికట్టి ప్రజలందరిని సైబర్ సిటిజన్స్ గా తయారు చేయాలనే లక్ష్యంతో బృహత్తర ప్రణాలికను సిద్ధం చేయడం జరిగింది. దీనిలో బాగంగా ఈ రోజు కామాండ్ కంట్రోల్ రూమ్ కాన్ఫరెన్స్ హాలు నందు కమీషనరేట్ పరిధిలోని అన్ని బ్యాంకుల అధికారులతో పోలీస్ కమీషనర్ కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…. ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ నేరాలపై ప్రజలలో భారీ ఎత్తున అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు పోవడానికి సైబర్ కమాండోలను, సోల్జర్స్ లను ఏర్పాటు చేసి వారి ద్వారా వారి ఏరియాలోని ప్రజలకు సైబర్ నేరాలు ఏవిధంగా జరుగుతాయి, సైబర్ నేరానికి గురికాకుండా ఉండాలంటే ఏ ఏ జాగత్ర్తలు తీసుకోవాలి? నేరం జరిగిన పక్షంలో ఏ విధంగా 1930 కు ఫిర్యాదు చెయ్యాలి? నేరం జరిగిన గంటలోపు (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేస్తే ఎటువంటి సత్ ఫలితాలు వస్తాయి, ఫిర్యాదు సమయంలో దర్యాప్తు అధికారులకి సమర్పించాల్సిన ఆధారాలు ఏమిటి వాటిని ఎలా సేకరించాలి? మొదలగు విషయాలపై ప్రజలను చైతన్య పరిచి వారిని సైబర్ సిటిజన్స్ గా మార్చడం జరుగుతుందని తెలియజేసారు.

అదేవిధంగా ఈ మధ్యకాలంలో అత్యధికంగా సైబర్ నేరగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో అధికారులుగా నటిస్తూ నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా కస్టమర్లను భయబ్రాంతులకు గురి చేసి వారు మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్ కేసుల్లో వారి ప్రేమేయం ఉన్నట్లు నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు. ఆపరాద రుసుము చెల్లించమని బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారని, మోసపోతున్న అమాయకులు బ్యాంకు కు వచ్చి వారి సేవింగ్స్ అకౌంట్ నుండి ఇతర రాష్ట్రల కరెంటు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలనీ బాంకు అధికారులను అడిగినప్పుడు అటువంటి సందర్భాలలో బ్యాంకు వారు పోలీస్ వారు ఇచ్చిన ప్రశ్నవలి వారికి వివరించి తదుపరి పూర్తి వివరాలను సేకరించి పోలీస్ వారికి తెలియజేసినప్పుడు ఇటువంటి నేరాలను నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ విషయం లో బ్యాంకర్స్ సహకారం అవసరం అని తెలియజేసారు.

ఎవరైనా కస్టమర్స్ కంగారుగా వచ్చి అధిక మొత్తంలో ట్రాన్స్ఫర్ చేయు సమయంలో వారిని బ్యాంకు మేనేజర్లు అడగాల్సిన ముఖ్య ప్రశ్నలు

ఈ లావాదేవీ వ్యక్తిని మీరు వ్యక్తిగతంగా తెలుసా?
డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు బదిలీ చేయమని ఒత్తిడి చేశారా?
సీబీఐ, కస్టమ్స్, పోలీస్ పేరుతో వీడియో కాల్ వచ్చిందా? అని వారిని పోలీస్ వారు ఇచ్చిన ప్రశ్నవలిలో ప్రశ్నలను అడగాలని సూచించారు.

ఈ క్రమంలో బ్యాంకు అధికారులకు కొన్ని ముఖ్య సూచనలు చేయడం జరిగింది.
* అనుమానాస్పద లావాదేవీలను నిలిపి పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి.

* బెదిరింపులకు గురైన కస్టమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించండి.

• 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు కాల్ చేయమని సూచించండి.

* కస్టమర్‌ను సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని కోరండి.

సైబర్ నేరాల నివారణలో బాగంగా త్వరితగతిన విచారణ చేపట్టడం జరుగుతుందని, ఈ క్రమంలో ఏమైనా సలహాలు ఉంటే తెలియజేయమని, ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు అందరూ బాగస్వాములు కావాలని, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి నేరాలు జరుగకుండా నిరోధించగలం అనే విషయంపై నగరం లోని అన్ని బ్యాంకు అధికారులతో కులంకుషంగా చర్చించడం జరిగింది.

అదే విధంగా నిన్న జరిగిన ఒక ఎన్ ఆర్. ఐ మహిళ నకిలీ సైబర్ నేరగాడి పెట్టిన భయబ్రాంతులకు గురి చేయడం ద్వారా కోటి 20 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసి మోసపోయిందో తెలియజేసి భవిష్యత్తులో మరెవ్వరూ ఇలా మోసపోకుండా బ్యాంకు అధికారులు అందరూ పైన తెలిపిన విధంగా పోలీస్ వారితో సమన్వయంగా ఉంటూ ఇటువంటి సైబర్ నేరాలు జరుగకుండా పాటుపడాలని కోరారు.

అదేవిధంగా ఎవరైనా భాదితులు మీ వద్దకు వచ్చి తన ఎకౌంటు లో తనకు తెలియకుండా డబ్బులు పోయినాయని బ్యాంకుకు వచ్చి చెప్పినప్పుడు వారి డబ్బులు ఏ ఎకౌంటు కు వెళ్ళినాయో వారికి తెలియజేయాలని, మెయిల్ ద్వారా ఏదైనా ఎకౌంటు ఫ్రీజ్ చేసినప్పుడు ఆ డబ్బును వెంటనే రిలీజ్ చేసిన భాదితుడు మరియు దర్యాప్తు అధికారులు చాలా ఆనందంగా ఉంటారని, చాలా మంది లక్షలలో మోసపోతున్నారని, వారిపట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని మరియు వారికి తగిన సలహాలను అందించి పోలీస్ వారికి దర్యాప్తులో సహకరించాలని కోరారు.

ప్రజలకు అవగాహన సూచనలు:
• ప్రభుత్వ సంస్థలు వీడియో కాల్స్ లేదా మెసేజ్‌లు ద్వారా అరెస్టులు చేయవు.

•OTPలు లేదా బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.

* తెలియని లావాదేవీలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి.

•బ్యాంకులు, ప్రజల సహకారం ద్వారా డిజిటల్ అరెస్ట్ మోసాలను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ బ్యాంకు మరియు వ్యక్తిగత వివరాలను తెలియని వారు ఎవరితోనూ పంచుకోకండి అని విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తోపాటు, డి. సి. పి. గౌతమి షాలి ఐ. పి. ఎస్, క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్., డి. సి. పి కృష్ణ మూర్తి నాయుడు, గుణ్ణం రామకృష్ణ, ఏ.సి.పి.లు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, నగరంలోని అన్ని బ్యాంకుల నుండి సుమారు 200 అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *