Breaking News

ఇప్పటికైనా వైసీపీ కళ్లు తెరవాలి… : కొలనుకొండ శివాజీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి కాజేసిన కేసులో హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు గౌతంరెడ్డిని ఆ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలి. ప్రజల ఆస్తులను కబ్జాచేయడం, హత్యారోపణలతో పాటు 42 కేసులున్న వ్యక్తిని వైసీపీ అగ్రనాయకుడు అంబటి రాంబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు వెనకేసుకురావడం అత్యంత దురదృష్టకరమని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ పార్టీ ఆయన్ను వెంటనే బహిష్కరించాలి. ఇక రెవిన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి ఆయన అక్రమం సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలి, గూండా యాక్ట్‌ పెట్టాలి. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేకుండా బార్‌ కౌన్సిల్‌ నుంచి ఆయన్ను బహిష్కరించాలి. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా విజయవాడ సీపీ ని కోరుతున్నాం. ఇక వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా మాఫియాపై పోలీసులు చర్యలు తీసుకోవడం హర్షదాయకం. అయితే వారికి అండగా ఉంటానంటూ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పడం సిగ్గుచేటు. తన తల్లి, స్వయాన సోదరిjైున మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు  షర్మిలపైన, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితరులపైన చెప్పరాని భాషతో సోషల్‌ మీడియా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డి లాంటి నీచులను పోలీసులు అరెస్టు చేస్తే తప్పేంటి? వీరిని తమ పార్టీవారుగా చెప్పుకోడానికి సిగ్గయినా ఉండాలి కదా… ఇలాంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వీరందరినీ అరెస్టు చేసిన సత్వర విచారణ జరిపి… జైలు శిక్షలు పడేలా చేయాలి. అంతేకాదు వీరిని సమర్థిస్తున్నవారిపై కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడి… వందల, వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టినట్లు ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మొదలుకొని వైసీపీ ముఖ్యనాయకులపై పత్రికల్లో కథనాలు వస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. తక్షణం వీరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. లూటీ చేసిన ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి అక్రమాల నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇటీవల బెజవాడ వరద బీభత్సంతో పాటు ఇతరత్రా ఆర్థిక కారణాలను సాకుగా చూపుతూ … ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రంలో వసూలయ్యే జీఎస్టీపై 1% సర్‌ఛార్జి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని కోరడం బాధాకరం. బెజవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సంభవించిన వరదనష్టాలకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా వెయ్యి కోట్ల పైచిలుకు సాయం అందడంతోపాటు పెద్ద ఎత్తున విరాళాలు కూడా వచ్చాయి. అది ముగిసిన అంశం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాల రాబట్టవలసిన సీఎం… ఈ విధంగా అదనపు భారాలు వేస్తే తట్టుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ఈ నిర్ణయం వల్ల వర్తక, వాణిజ్య రంగాలపై రూ.600 కోట్ల పైచిలుకు అదనపు భారం పడుతుంది. అది అంతిమంగా ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే 17వేల కోట్ల రూపాయల విద్యుత్‌ భారాలు వెయ్యడం ప్రజలను కుంగదీసింది. ఈ రెండు నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో మా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అనేక సభల్లో బలమైన ప్రసంగాలు చేస్తూ… ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అయితే ఆయన హెలికాప్టర్‌లో ఎక్కి కూర్చున్న తర్వాత హెలికాప్టర్‌కు అనుమతివ్వకుండా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆపేయడం జరిగింది. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రే. దీనిని ఏపీసీసీ తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్‌ నాయకుడు అల్లం రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *