Breaking News

“ఆయుర్వేద సద్వైద్య సంభాషా పరిషద్” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని గ్రంథస్తం కాని అనుభవ చికిత్సలు ను ఆయుర్వేద వైద్యులు,విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన కి దోహదపడుతుంది అన్న ఉద్దేశ్యం తో “ది మెడికల్ ప్రాక్టీషనర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్(ఇంపీకప్స్) ఆధ్వర్యంలో ప్రతినెల విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ నందు జరిగే “ఆయుర్వేద సద్వైద్య సంభాషా పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య పరిజ్ఞానం ని సమీకరించి అధునాతన జ్ఞానం తో నైపుణ్యం పొందడం, ప్రాక్టీసు నందు కలుగుతున్న సందేహాలు నివృత్తి చేయడం ముఖ్య ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఆయుర్వేదం ప్రపంచం కి పరిచయం చేయడానికి కృషి మరియు ఆయుష్మాన్ భారత్ పథకం లో 190 ఆయుర్వేద చికిత్సలు చేర్చడానికి కేంద్రం అంగీకారాన్ని తెలపడం అభినందనీయం.
మన రాష్ట్రంలో “ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్” ఏర్పాటు, ఆయుష్ క్లినిక్స్, హాస్పిటల్స్ ఏర్పాటు కి సంబంధించి” క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం”,ఆయుష్ చికిత్సలు కి “రీయింబర్సుమెంట్ సౌకర్యం” ” డా. యన్. టి. ఆర్ వైద్య సేవ” పథకం లో ఆయుర్వేద చికిత్సలు” కి స్థానం కలిపించడం,”ఆయుర్వేద ఇండస్ట్రీ అభివృద్ధి” విషయాలు పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చూపితే కేరళ తరహాలో ఆయుర్వేద టూరిజం మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ఆయుర్వేదం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కి దోహదపడుతుంది.
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కటి శూల మరియు గృధ్రసీ(లంబార్ డిస్క్ సమస్యలు) వ్యాధుల లో తన ప్రాక్టీసు లోని అనుభవ చికిత్సలు ని సభలో తెలియచేశారు.ఈ కార్యక్రమం కి సమన్వయకర్త గా డా. పమ్మి సూర్యకుమార్ వ్యవహరించగా డా.ఆదర్శ్, డా. ప్రియాంక, డా. జాబిల్లి సహకారo అందించారు. చివరగా డా. కొండా వెంకటేశ్వర్లు ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *