-పలు అభివృద్ధి పనుల నిర్మాణాలను పరిశీలన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ పరిశీలించారు. గురువారం చందర్లపాడు -1 గ్రామ సచివాలయాన్ని జెసి ఎల్. శివశంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరిపే బోర్డులు ప్రదర్శించింది లేనిది ఆయన పరిశీలించారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలపై సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు బాధ్యతయుతంగా నిర్వహించాలన్నారు. వివిధ సేవల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సచివాలయ సేవలు ఎలా అందుతున్నాయో ఆయన ఆరా తీశారు. సచివాలయానికి వచ్చే ధరఖాస్తులను పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలన్నారు. అనంతరం చందర్లపాడులో నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర నిర్మాణాలను జెసి శివశంకర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం తుర్లపాడు గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని పరిశీలించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణాలను ఆయన పరిశీలిచారు. పూర్తి నాణ్యతతో ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. అనంతరం తుర్లపాడులో జగనన్న లేఅవుట్ ను పరిశీలించారు. వీరి వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.