Breaking News

శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంధాలయము, రాజమహేంద్రవరం 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవములు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం ఉదయం మహిళా దినోత్సవం, ఇందిరా గాంధీ జయంతి సంధర్భంగా మాజీ ప్రథాన మంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యం లో “గురు వందన్ చాత్ర అభినందన్” గురువులకు సన్మానం, విధ్యార్ధులకు అభినందన కార్యక్రమం మరియు అల్లు రామకృష్ణ వారిచే పురాతన నాణెములు, నోట్లు, పోస్టల్ స్టాంప్ లు, ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి బీవీపి పూర్వ అధ్యక్షలు పి.వి.ఎస్. కృష్ణారావు , రాజమండ్రీ శాఖ అధ్యక్షులు బి.రత్నాంబ , రాష్ట్ర మహిళా సహ భాధ్యత డాక్టర్ బి.అనురాధ, , డాక్టర్ అరిపిరాల నారాయణ రావు , పి. రాంబాబు గ్రంధాలయ అధికారిణి జి. శ్రీదేవి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ వారి అధ్వర్యంలో “గురు వందన్ చాత్ర అభినందన్” కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రి మహిళా కళాశాల లెక్చరర్ – ఈ ఎమ్ ఎ పొలిటికల్ కనకదుర్గ, శ్రీ గౌతమీ స్కూల్ రాజమహేంద్రి మహిళా కళాశాల ఫిజిక్స్ టీచర్ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ విద్యార్థినిగా చిరంజీవి బి. ఉమామహేశ్వరి లకు, పురాతన నాణాలు, పోస్టల్ స్టాంప్స్, నోట్లు ప్రదర్శన ఏర్పాటు చేసి విధ్యార్ధినీ విధ్యార్ధులకు వాటిగురించి తెలియచేశారు . కార్యక్రమంలో భాగంగా అల్లు రామకృష్ణ వారి సత్కారకార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమలో వివిధ పాఠశాలలనుండీ విధార్ధినీ, విధ్యార్ధులు గ్రంధాలయ సిబ్బంది పాఠకులు మహిళలు పెద్దసంఖ్య లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గ్రంధాలయ వారోత్సవాల సంధర్భంగా వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన విదార్థినీ విద్యార్థులకు బుధవారం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రంధాలయ అధికారి జి . శ్రీదేవి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *