విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పటమట రైతు బజారు వద్ద శ్రీ ధర్మ శాస్త సేవ సమితి ఏర్పాటు చేసిన మాలధారులకు నిత్యా అన్నప్రసాద కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఆ ఆవరణలో వేణు గురుస్వామి ఏర్పాటు చేసిన పీఠం వద్ద అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ ను వేణుగురుస్వామి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ అయ్యప్ప మాలధారణ భక్తులతో మాట్లాడుతూ ఎన్నో నియమ నిష్టలతో, కఠోర దీక్షచేసే అయ్యప్ప స్వాములను కలవటం ఆ అయ్యప్ప కృప అన్నారు. అందరిపై ఆ అయ్యప్ప ఆశీస్సులు వుండాలని ప్రార్థించారు.
Prajavartha Online Telugu News