Breaking News

Tag Archives: machilipatnam

యువతలో టాలెంట్ వెలికి తీసేందుకు యువ కెరటాలు కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో నూతన ఉత్తేజం కలిగించేందుకు, వారిలో దాగివున్న టాలెంట్ వెలికి తీసేందుకు యువ కెరటాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో శుక్రవారం ప్రారంభమైన యువ కెరటాలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని నింపి నూతన ఉత్సాహాన్ని నింపిన వివేకానందుని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. వివేకానందుని జన్మదినం జనవరి …

Read More »

బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం..

-అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద రూ.50 వేలు అందించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో జరుగుతున్న పోలీస్ సెలక్షన్ ఈవెంట్స్ లో పరుగు పందెంలో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన ధారావత్ చంద్రశేఖర్ (25) కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం …

Read More »

యువ కెరటాలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాల భవిష్యత్తుకు నాంది యువ కెరటాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈ డబ్ల్యూ ఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖా మంత్రి శ్రీమతి ఎస్ సవిత అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో శుక్రవారం నుండి నిర్వహిస్తున్న యువ కెరటాలు రెండు రోజుల కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనాటి బాలలే రేపటి పౌరులు, యువతలో దాగి ఉన్న స్కిల్స్ వెలికి తీయడానికి …

Read More »

పుస్తక పఠనంతో కొత్త ఆలోచనలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పుస్తక పఠనం ప్రతి ఒక్కరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ఆ అనుభూతుని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెండు బీరువాలతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పండుగలు, ముఖ్యమైన సందర్భాలలో తనను కలవడానికి వచ్చినప్పుడు పుష్పగుచ్చాలు, మొక్కలు, స్వీట్స్, శాలువలకు బదులుగా ఉపయోగపడే మంచి పుస్తకాలను కానుకగా అందించాలని, తద్వారా వాటిని అవసరమైన …

Read More »

పెడన కలంకారీ కి పూర్వవైభవం తీసుకువద్దాం….

-కలంకారీ క్లస్టర్ ఏర్పాటుతో పదివేల కుటుంబాలకు లబ్ధి…. -క్లస్టర్ ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలన…… జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలంకారి క్లస్టర్ ఏర్పాటుతో పెడన కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావటం తో పాటు, ఆ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలోని పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ …

Read More »

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, పశుసంవర్ధక, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖాధికారులతో కోడి పందేల నిర్వహణ నిషేధంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా కోడి పందేలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం అధికారులతో కూడిన డివిజన్, మండల, …

Read More »

పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు మంజూరు చేసేందుకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయతర రంగంలో వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రుణాల లక్ష్యాలు సాధించిన ప్రగతి సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా …

Read More »

అర్హులందరికీ పింఛన్లు… : మంత్రి కొల్లు రవీంద్ర

శారదనగర్(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరం 31వ డివిజన్ శారదానగర్ లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. వీరవల్లి బసవ నాగేంద్రమ్మ, అనిశెట్టి శేషగిరిరావు, గంజల శశిరేఖకు వృద్ధాప్య పింఛన్లు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్ గంగపుత్రుని వినయ్ కుమార్ కు నూతనంగా మంజూరైన రూ.10వేలు …

Read More »

తాగునీటి పథకాల పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా, తాగునీటి పథకాల పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ లో ఆర్డబ్ల్యూఎస్, గనులు, ఎపి విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థల ద్వారా పార్లమెంటు సభ్యుని నిధులు, సి ఎస్ ఆర్ నిధులు, డిస్టిక్ మినరల్ ఫండ్, నాబార్డ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

మత్స్యకారులకు బోటు రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు అందజేసిన కలెక్టర్

-ఇచ్చిన హామీ నెరవేర్చిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్ లోని తమ చాంబర్ నందు 17 మంది మత్స్యకార బోటు యజమానులకు మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు అందజేశారు. గత సెప్టెంబర్ మాసంలో విజయవాడలో వరద ముంపు బాధితులను రక్షించేందుకు అత్యవసరంగా బోట్లు అవసరం కాగా, జిల్లా కలెక్టర్ వెంటనే మంగినపూడి బీచ్ ఉప్పాడ పాకలు ప్రాంతం వెళ్లి మత్స్యకారులతో మాట్లాడి వారి బోట్లను లారీలలో విజయవాడ ఆఘమేఘాల మీద …

Read More »