నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోటీ 10 లక్షల రూపాయలతో అధునాతన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏరియా ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న దృష్ట్యా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా …
Read More »Tag Archives: nuzividu
ఇంటింటికీ రేషన్ పంపిణీని సక్రమంగా నిర్వహించాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటింటికీ రేషన్ పంపిణీపై పౌర సరఫరాలశాఖ అధికారులు , రేషన్ పంపిణీ వాహనాల డ్రైవర్లతో గురువారం జరిగిన సమావేశంలో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని , ప్రజల నుండి ఎటువంటి విమర్శలకు తావులేకుండా రేషన్ …
Read More »జగనన్న పాలవెల్లువ వచ్చింది … తక్కువ ధర ఇచ్చే పాల డెయిరీలకు ఇక కాలం చెల్లినట్లే…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ పాల డెయిరీల ఆధిపత్యానికి జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా అడ్డుకట్ట వేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బుధవారం నూజివీడు మండలం బోరవంచ గ్రామంలో పాలవెల్లువ పథకానికి వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జిల్లాపరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, వైస్ ఛైర్మన్ జి.కృష్ణంరాజు, గ్రామ సర్పంచ్ ఉదయ్ శంకర్, జగనన్న పాలవెల్లువ సహాకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం… .
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ …
Read More »హార్టికల్చర్ హబ్ గా నూజివీడు ప్రాంతం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
-300 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ -నూజివీడులో మామిడి రైతుల అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్యే నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక మామిడి పరిశోధనా కేంద్రంలో గురువారం సీజనల్ కండీషన్స్ లో మామిడి పంటల పరిరక్షణపై డివిజన్ స్థాయి మామిడి రైతులకు జరిగిన అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ …
Read More »క్రీడలతో శారీరక,మానసిక దృఢత్వం పెరుగుతుంది : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలతో శారీరక,మానసిక దృఢత్వం పెరుగుతుందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ పాఠశాలలో గురువారం నూజివీడు నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు హైస్కూలు ప్రధానోపాద్యాయురాలు బి. హేమలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నదని, మన బడి …
Read More »జగనన్న పాలవెల్లువ ద్వారా పాడి పరిశ్రమకి మంచి రోజులొస్తాయి: జిల్లా కలెక్టర్ జె.నివాస్.
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పాడి పరిశ్రమకు జగనన్న పాలవెల్లువ పధకం ద్వారా మంచి రోజులొస్తాయని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లిలో జగనన్న పాలవెల్లువ పాలవెల్లువ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడి రైతుల పాలిట వారమన్నారు. జిల్లాలో ప్రైవేట్ డెయిరీ ల దోపిడీ నుండి పాడి రైతులను రక్షించి వారి ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం తోడ్పడుతుందన్నారు. ఈ పధకాన్ని …
Read More »తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే పిల్లలపై కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తాం: ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక.
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులను ఆర్డీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి మండలం సీతారామపురంనకు చెందిన జక్కం అంజమ్మ తన కొడుకు ముసలి వయస్సులో తనను చూడకుండా నిరాదరణకు గురిచేయడంతోపాటు పలు బాధలు పెడుతున్నాడని వాపోయింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తల్లితండ్రుల పరిరక్షణ బాధ్యత వారికి పుట్టిన బిడ్డలదేనని, తల్లితండ్రులను నిరాధరణకు గురిచేసే బిడ్డలపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామన్నారు. ఆగిరిపల్లి తహశీల్దారుకు ఫోన్ చేసి …
Read More »జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వేగవంతంగా పూర్తిచేయాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం అమలుపై అధికారులు, సిబ్బందితో సోమవారం సాయంత్రం ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం గంపలగూడెంలో నత్తనడకన సాగుతున్నదని, ముఖ్యంగా గంపలగూడెం, అమ్మిరెడ్డిగూడెం, మేడూరు, ఆర్లపాడులలో ప్రగతి లేదన్నారు. ఓటిఎస్ వినియోగించుకుంటే ఆస్తిపై పూర్తి హక్కుతో …
Read More »నూజివీడు ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తాను: జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ప్రాంతం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక చెప్పారు. స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఛాంబర్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లాపరిషత్ చైర్మన్ పర్సన్ హారిక మాట్లాడుతూ నూజివీడు ప్రాంతంలో సాగు, త్రాగు …
Read More »
Prajavartha Online Telugu News