నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పాలనలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన నేత ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు పట్టణం 1వ వార్డు యం.ఆర్.అప్పారావు కాలనీలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉచితంగా అందించడమే …
Read More »Tag Archives: nuzividu
జగనన్న పాలవెల్లువ విజయవంతంగా అమలు చేసే బాధ్యత గ్రామ డైరీ సంఘం కార్యదర్సులదే: జిల్లా కలెక్టర్ జె.నివాస్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేసి పధకాన్ని విజయవంతంగా అమలు చేసే బాధ్యత గ్రామ డైరీ సంఘం కార్యదర్సులదేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశపు హాలులో నూజివీడు, అగిరిపల్లి మండలాలకు చెందిన గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం పాడి రైతుల జీవన విధానాన్ని మారుస్తుందన్నారు. పశువులకు పోషకాలతో …
Read More »నూజివీడు లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ జె.నివాస్
-శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తో కలిసి నిర్మాణ ప్రదేశం, తాత్కాలిక భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. నూజివీడులో గురువారం కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, తాత్కాలిక భవనాలను స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు …
Read More »డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయం: ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేద వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు కృషిచేసి భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్.అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే …
Read More »గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై ” డెకాయ్ ఆపరేషన్స్” : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ పిండం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై”డెకాయ్ ఆపరేషన్స్” నిర్వహించాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గర్భస్థ పిండ లింగనిర్ధారణ నియంత్రణ డివిజన్ స్థాయి సమావేశం ఆర్డీఓ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గర్భస్థ పిండం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. వైద్య శాఖ సిబ్బంది తో స్కానింగ్ కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి ఎవరైనా …
Read More »జగనన్న పాలవెల్లువ పధకాన్ని మహిళా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ పధకాన్ని మహిళా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి కోరారు. నూజివీడు మండలం బోర్వ0చ లో జగనన్న పాలవెల్లువ పధకం అమలుపై మహిళా పది రైతులు, సిబ్బందితో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నూజివీడు డివిజన్ లోని 14 మండలాలలోని 160 రైతు భరోసా కేంద్రాల పరిధిలో జగనన్న పాలవెల్లువ పధకం అమలు కోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 13వ …
Read More »థర్డ్ వేవ్ రూపంలో కరోనా ముంపు ఇంకా పొంచి ఉంది, ప్రజలు అప్రమత్తం ఉండాలి : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ రూపంలో ఇంకా పొంచి ఉందని, ప్రజలను అపప్రమత్తం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్యాధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కరోనా ముంపు ఇంకా సమసిపోలేదన్నారు. మొదటి, రెండవ వేవ్ లతో పోలిస్తే థర్డ్ వేవ్ మరింత ఉదృతంగా ఉండే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరిక దృష్ట్యా అధికారులు ప్రజలను మరింత అపప్రమత్తంగా …
Read More »రైతన్నల సాగు బడి – పొలం బడి…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతన్న కు సాగులో మెళకువలు, సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు, పంటకు చీడపీడలు ఆశించకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు వివరించి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట అధిక దిగుబడి సాదించేందుకు రైతును సమాయత్తపరచడమే “పొలంబడి” కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రయోగశాలల్లోని ఫలితాలు క్షేత్రస్థాయిలోని రైతులకు అందించడమే పొలంబడి ప్రధాన లక్ష్యం వివిధ రకాల పంటలకు అనువైన భూమి, దానికి ఉండే నీటి వనరులు, విత్తన …
Read More »పేదరికం పారద్రోలేందుకు విద్య ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ జె.నివాస్
-పమిడిముక్కల మండలం గురజాడలో ఎస్.టి కాలనీని సందర్శించిన కలెక్టర్ పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలను పాఠశాలకి పంపించి కుటుంబం నుండి పేదరికం పారద్రోలాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. పమిడిముక్కల మండలం పమిడిముక్కల మండలం గురజాడ ఎస్టి కాలనిని ఆదివారం కలెక్టర్ నివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ ని కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు. తమకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవని, వీటి కారణంగా తాము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పొందలేకపోతున్నామని కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News