Breaking News

Tag Archives: rajamendri

విద్యార్థులు సన్మార్గంలో నడవాలి – రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ప్రేరణాత్మక కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ఆదివారం స్థానిక రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో సమీకృత బీసీ బాలికల వసతి గృహం, రాజమహేంద్రవరం నందు “ఉత్తమ విద్య – సన్మార్గం” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి అర్చనా నంద, స్వామి శశికాంతా నందజీ మహరాజ్, స్వామి పరిజ్ఞయానందజీ మహరాజ్, వీర్రాజు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఉత్తమ విలువలతో కూడిన విద్యను అభ్యసించి, సమాజానికి ఉపయోగపడే సన్మార్గంలో నడవాలని వారు ఉపదేశించారు. కార్యక్రమంలో భాగంగా …

Read More »

రాబోయే రబీ సీజన్‌లో యూరియా నిల్వలు & పంట నమోదు పై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రబీ సీజన్‌లో యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్ నుండి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగా సరిపడా యూరియా నిల్వలు కల్పించామని తెలిపారు. గత మూడు సంవత్సరాల రబీ సీజన్లలో వినియోగించిన ఎరువుల సగటును పరిగణనలోకి తీసుకుని, ఈ సీజన్‌కు తగినంత …

Read More »

కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

-కమిషనర్ రాహుల్ మీనా -పుష్కర ఘాట్ లో ఏర్పాట్ల పరిశీలన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసం నేపథ్యంలో గోదావరి స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పుష్కర ఘాట్ లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. లైటింగ్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకొను గదులు, లాకర్లను పరిశీలించారు. …

Read More »

ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం – బ్రెజిల్ బృందం ప్రశంస

కొవ్వూరు/ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయం అమలులో మహిళల పాత్ర అభినందనీయమని బ్రెజిల్ బృందం ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే క్రమంలో బ్రెజిల్, UAE, మరియు శ్రీలంకకు చెందిన 30 మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం రెండవ రోజు (5 అక్టోబర్ 2025) కాపవరం, కురుకూరు మరియు ఎర్నగూడెం గ్రామాలను సందర్శించింది. ఈ పర్యటన రైతు సాధికార సంస్థ (RySS) మరియు నౌ భాగస్వాములు (NOW Partners) సంయుక్తంగా నిర్వహించారు. నౌ పార్టనర్స్ వ్యవస్ధాపకులు వాల్టర్ లింక్ తో …

Read More »

సూపర్ GST – సూపర్ సేవింగ్స్

-మత్స్య రంగానికి ఆర్థిక ఉపశమనం -జిల్లా మత్స్యశాఖ అధికారి / జేడీ – ఎన్ . నిర్మలా కుమారి రాజానగరం (నరేంద్రపురం), నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్య రంగానికి గణనీయమైన లాభాలను అందిస్తున్న కొత్త GST సర్దుబాట్లను ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని జిల్లా మత్స్య అధికారి / సంయుక్త సంచాలకులు ఎన్. నిర్మలా కుమారి పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో జి ఎస్ టి ప్రచార కార్యక్రమం మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త …

Read More »

ప్రకృతి వ్యవసాయ రంగం పై కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు, డీ ఆర్ డీ ఏ, డ్వామా, ఉద్యాన, ఏపీ ఎంఐపీ, పశు సంవర్థక, మార్కెటింగ్ అధికారులు, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్‌లతో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఆశావహ దృక్పథం, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా …

Read More »

“స్వర్ణ ఆంధ్ర విజన్–2047” లో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో 1వ స్థానం

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మార్గదర్శకం, దిశా నిర్దేశం తో సాధ్యం -డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలవు తున్న “స్వర్ణ ఆంధ్ర విజన్–2047” కార్యక్రమంలో 92% పనితీరు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని పొందిందనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె వెంకటేశ్వర రావు గురువారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. జిల్లాలో పిల్లలకు పూర్తి టీకాలు అందించడం, శిశు మరణాల రేటు తగ్గుదల, న‌వజాత …

Read More »

ఆర్థిక సాధికారత – సామాజిక మార్పులోనూ ఎస్ హెచ్ జీ మహిళలు ముందుండాలి

-రెండు దశాబ్దాల్లో రుణాల మంజూరులో విప్లవాత్మక మార్పు – లక్ష రూపాయల నుండి 20 లక్షల వరకు -మహిళలు ఆర్థిక శక్తితో పాటు సామాజిక బాధ్యత వహించాలని పిలుపు -అబ్బాయిలకూ మహిళల భద్రతపై అవగాహన అవసరం అప్పుడే ఆడపిల్లలు సురక్షితం -SHG బ్రాండ్‌తో టీ స్టాల్స్ – భవిష్యత్తులో ఫ్రూట్ స్టాల్స్ దిశగా అడుగులు -ఎరువుల అధిక వినియోగం ఆరోగ్యంపై ప్రభావం – పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం తగ్గింపులో SHGs ముందుండాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం …

Read More »

నానో ఎరువులు, బయో ఎరువులపై ప్రదర్శన అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నానో యూరియా, బయో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం, తొర్రేడు గ్రామంలో నానో ఎరువులు, బయో ఎరువులపై ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు మాట్లాడుతూ, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిల్లీ రావు సూచనల మేరకు, నానో యూరియా ప్రయోజనాలు, …

Read More »

NH-16 రహదారి నిర్వహణలో నిర్లక్ష్యం – క్షేత్రస్థాయి పర్యవేక్షణలో లోపంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం

రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో రాజమండ్రి సమీపంలో కొల్‌కత్తా – చెన్నై హైవే (NH-16) లో జరుగుతున్న రహదారి నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నవరం నుంచి దివాన్ చెరువు వరకు 70 కి.మీ. మేర జాతీయ రహదారి నిర్వహణ పనులు TOT (టోల్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ముంబైకి చెందిన సేఫ్ వే …

Read More »