తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పవిత్రక్షేత్రంలోని కచ్ఛప్ ఆడిటోరియం (టుడా ఆఫీస్ వెనుకభాగం) లో నిర్వహించిన సౌత్ ఇండియా మ్యారేజ్ మీడియేటర్స్ కాన్ఫరెన్స్ – 2025 & 5వ వార్షికోత్సవ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక హర్షణీయమైన అంశమని ఆయన …
Read More »Tag Archives: tirupathi
“ది త్వా” తుఫాను కారణంగా పిజిఆర్ఎస్ రద్దు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : “ది త్వా” తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా 01.12.2025 తేదీ న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పిజిఆర్ఎస్) రద్దు పరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు “ది త్వా” తుఫాను కారణంగా సహాయకచర్యలలో ఉన్నందువలన ప్రజలెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను సోమవారం నాటి ప్రజా సమస్యల పరిష్కార …
Read More »ఫ్లేమింగో ఫెస్టివల్–2026 విజయవంత నిర్వహణకు ఏర్పాట్లు తక్షణం ప్రారంభించాలి
-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ మరియు ఛైర్మన్, జిల్లా పర్యాటక మండలి (DTC) వారి అధ్యక్షతన ఫ్లేమింగో ఫెస్టివల్–2026 నిర్వహణపై ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డా.రమణ ప్రసాద్, సూళ్లూరుపేట ఆర్డిఓ కిరణ్మయి, జిల్లా అటవీ శాఖ అధికారి సాయిబాబా, సులూరుపేట డివిజన్ అటవీ శాఖ అధికారి హారిక, సంబంధిత అధికారులతో ఫ్లెమింగ్ ఫెస్టివల్ నిర్వహణపై జిల్లా పర్యాటక మండలి సమీక్షా …
Read More »శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయింపు, పంపిణీ పక్రియ చేపట్టాలి
-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్లాట్లును కేటాయింపు, పంపిణీ పక్రియ చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరం నందు శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనుల పై ఇంచార్జీ జాయింట్ కలెక్టర్, నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి, …
Read More »తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషితో గుడిమల్లం అన్నదాన సత్రానికి అనుమతులు మంజూరు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి నిరంతర కృషి ఫలితంగా గుడిమల్లం శ్రీ పరసురామేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనుమతి మంజూరు చేసింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన శివలింగాలలో ఒకటైన గుడిమల్లం శివ లింగాన్ని దర్శించేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అవసరమైన సౌకర్యాల విస్తరణ అత్యవసరమని ఎంపీ గురుమూర్తి పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి, పురావస్తు శాఖకు లేఖల ద్వారా వివరించారు. భక్తుల …
Read More »ఈ నెల 24 నుండి డిసెంబర్ 3 వరకు రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహణ
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మరియు ఇతర అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 24 నుండి డిసెంబర్ 3 వరకు రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ ల సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ ఎనర్జీ అసిస్టెంట్, ఆదర్శ రైతు , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ …
Read More »మొబైల్ డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని మంగళం రోడ్డులో జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు, సెల్ ఫోన్ వినియోగిస్తూ ద్విచక్ర వాహనాలు నడపుతున్న వారిపై కేసులు నమోదు చేసి, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ తనిఖీలలో 22 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగింది. చరవాణి వినియోగిస్తూ వాహనం నడుపుతున్న పది ద్విచక్ర వాహనాలపై , ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న మరో పది వాహనాలపై మరియు డ్రైవింగ్ …
Read More »అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందించాలి
-అధికారులు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు పనిచేయాలి : దిశా చైర్మన్ మరియు తిరుపతి ఎం.పి. గురుమూర్తి -అర్హులైన పేదలకు, లబ్దిదారులు ప్రజా సంక్షేమ పథకాలు అందించాలి -దిశా సమావేశానికి గైర్హాజరు అయితే చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు ప్రజలకు తప్పక అందించాలని, అధికారులు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి …
Read More »ఘనంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో ఘనంగా నిర్వహించిన వసంతోత్సవంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. డా. హరిప్రసాద్ తో పాటు సతీమణి గౌరీ, సోదరులు వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక సేవలు, పూజల్లో పాల్గొన్నారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతుల్లో …
Read More »శ్రీ వస్కోటు ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాస మంగపురం సమీపంలోని శ్రీ వస్కోటు ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ, గత మూడు నెలలుగా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిరంతరం జరుగుతున్న అన్నదాన సేవ భక్తి, సేవాబావనలకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. భక్తులతో కలిసి …
Read More »
Prajavartha Online Telugu News