Breaking News

Tag Archives: tirupathi

పండుగ వాతావరణంలో శెట్టి పల్లి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

-శెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ -70 ఏళ్ల శెట్టిపల్లి భూ సమస్యకు ముగింపు -రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ -శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -ముఖ్యమంత్రి సంకల్పంతో శెట్టిపల్లి భూ లబ్ధిదారులకు రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ -తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి -ఈ-డిప్ …

Read More »

అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని విజయవంతం చేయండి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రమైన తిరుపతి లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ గారు , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ శైలజ గారు, ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి కోటి రెడ్డి గారు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి DM&HO కార్యాలయం నుండి సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ లైట్ కార్యక్రమం ప్రారంభమవుతుందని …

Read More »

“తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్–2026”

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్–2026” పరీక్షను ఆదివారం తిరుపతి జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి కె. చిన్నారెడ్డి తెలిపారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలలో మొత్తం 467 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, అందులో 405 మంది హాజరై 86.72 శాతం హాజరు నమోదైందన్నారు. 62 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వారీగా ఎస్‌పీజేఎన్‌ఎం మున్సిపల్ హై స్కూల్, సరోజినీదేవి రోడ్, తిరుపతిలో 251 మందికి …

Read More »

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

-మండల కార్యాలయాల్లో తహసిల్దార్లు ఎంపీడీవోలు ఇతర మండల అధికారులు వినతులు స్వీకరిస్తారు -ఆర్డీవో కార్యాలయాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని స్వీకరిస్తారు -ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరం అయితేనే ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టరేట్ కు రావాలి -జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18 వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం …

Read More »

తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో రైల్వే సమస్యలు పరిష్కరించండి

-నైలెట్ తిరుపతి శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయండి -కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యల పరిష్కారం, అలాగే డిజిటల్ విద్యా మరియు సైబర్ పరిశోధన రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి, రేణిగుంట, …

Read More »

తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు తీపి కబురు

-గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందన.. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా గాజులమండ్యం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్ధరణ, ఆధునీకరణ అంశంపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించినట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం తాను …

Read More »

జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జపాన్ దేశం లో ఉద్యోగాల కొరకు శ్రీ సిటీ , తిరుపతి జిల్లా నందు అర్హత కలిగిన యువతి యువకులకు ట్రైనింగ్ మరియు జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును . 1: జపాన్ దేశం నందు మ్యానుఫ్యాక్చరింగ్ ,క్యారేజ్ గివింగ్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ (Manufacturing /Caregiving/ Construction/Hospitality/Automobile) సంబంధిత సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జపాన్ దేశంలోని ఉద్యోగ …

Read More »

సత్యవేడు మండలం లో చేపట్టిన భూ సేకరణకు గ్రామస్తులు సహకరించాలి

-భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది -జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమ ఏర్పాటుకు సత్యవేడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకు గ్రామస్తులు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు పేర్కొన్నారు. శుక్రవారం సత్యవేడు మండలంలో సత్యవేడు తహశీల్దార్ కార్యాలయంలో ఇరుగళం, కోళ్లడం గ్రామస్థులతో భూ సేకరణకు సంబంధించి భూమి రేటు పై సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేంద్రరెడ్డితో కలసి జిల్లా జాయింట్ కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయoకు వచ్చు భక్తుల సౌకర్యం తిరుచానూరు రోడ్డు విస్తరణ పనుల నిర్మాణం కొరకు మాస్టర్ ప్లాన్

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయoకు వచ్చు భక్తుల సౌకర్యం కొరకు రాక పోకలు సజావుగా ఉండేలా ట్రాఫిక్ సమస్య తీర్చుట కొరకు మాస్టర్ ప్లాన్ లో భాగంగా తిరుచానూరు రోడ్డు విస్తరణ, పార్కింగ్ కు సంబంధించిన పనుల పై టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సి వి ఎస్ ఓ మురళి కృష్ణ తో కలిసి తుడా, టిటిడి వారు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను పవర్ …

Read More »

శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన మనవరాలి కేశకండన కార్యక్రమం అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ద్వారా సామాన్య భక్తుడిలా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని మంత్రికి అందజేశారు. …

Read More »