ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, ఐ.ఏ.ఎస్ ఆదివారం శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునకు విచ్చేసి స్వామి వారిని …
Read More »Daily Archives: June 2, 2024
ఈనెల 6, 7, 8వ తేదీలలో జూనియర్ బాయిస్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాన్సెస్ బేవియర్ మెమోరియల్ ఫుట్ బాల్ సహకారంతో ఏపీ మరియు ఎన్టీఆర్ జిల్లా ఫుట్ బాల్ అసోషియోషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8వ తేదీలలో కానూరు వి.ఆర్ సిధార్థ కాలేజీ క్రీడా మైదానంలో జరుగుతున్న ఫుట్ బాల్ టోర్నమెంట్ పోటీలు అని ఆదివారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ప్రాన్స్ జేవియర్ మెమోరియల్ ఫుట్ బాల్ క్లబ్ ఫౌండర్ & అధ్యక్షులు వి శ్యామ్యూల్ మాట్లాడుతూ ఈ యొక్క ఫుట్ …
Read More »వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు చేపట్టింది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్నివాల్, లేజర్ షో, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పదేళ్ల పండుగ.. రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించి, పరేడ్ …
Read More »ఆంధ్ర ప్రదేశ్ ని తాకిన రుతుపవనాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయి.
Read More »భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా చౌదరి జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గన్నే వెంకటనారాయణ ప్రసాద్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. గన్నే వెంకటనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ రేపు నాలుగో తారీఖు ప్రజలందరూ ఆశీర్వాదంతో పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలబోతున్నారు. సుజన చౌదరి. ఈ పశ్చిమ నియోజకవర్గానికి పేద ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేసి చూపెడతారని …
Read More »కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తి…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 4వ తేదీన చేపట్టే ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, ఎస్. డిల్లీరావు తెలిపారు. కలెక్టరేట్ ఛాంబర్‌లో ఆదివారం ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డిల్లీరావు నియోజవర్గాల లెక్కింపు పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »64వ డివిజన్ లో అనారోగ్యం బారిన పడిన కుటుంబాలను బొండా ఉమామహేశ్వరరావు పరామర్శ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 64వ డివిజన్ రాధా నగర్ నందు ఆదివారం తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పర్యటించి ఇటీవల మంచినీటి కాలుష్యం వలన అనారోగ్యం బారిన పడిన కుటుంబాలను పరామర్శించి స్థానికంగా ఉన్న వాటర్ పైపులైనులను తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానికంగా డ్రైనేజీ నీరు వాటర్ పైపులైనులతో కలిసి మంచినీరు కలుషితం అవటం వలన ఈ ప్రాంతంలోని …
Read More »ఓట్ల లెక్కింపునకు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాం
-కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల సంబంధిత నివేదికలు , ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు , ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు సిద్ధంగా వున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత వివరించారు. ఆదివారం వెలగపూడి ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి సార్వత్రిక ఎన్నికలు – 2024 కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ఓట్ల లెక్కింపు , జిల్లాల …
Read More »కౌంటింగ్ సిబ్బంది కి శిక్షణ కార్యక్రమం
-కౌంటింగ్ విధి విధానాలు పై అవగాహన కల్పించిన కలెక్టర్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో చక్కటి పనితీరు కనపర్చాలని , సమన్వయం చేసుకోవడం కీలకం అని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ లో కౌంటింగ్ సిబ్బంది క్షేత్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, జూన్ 4 వ తేదీ …
Read More »కౌంటింగ్ సిబ్బంది కి శిక్షణ కార్యక్రమం
-కౌంటింగ్ విధి విధానాలు పై అవగాహన కల్పించిన కలెక్టర్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో చక్కటి పనితీరు కనపర్చాలని , సమన్వయం చేసుకోవడం కీలకం అని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ లో కౌంటింగ్ సిబ్బంది క్షేత్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, జూన్ 4 వ తేదీ …
Read More »