Breaking News

All News

ఏపీ ఈజ్ బ్యాక్-దేశవ్యాప్త చర్చగా మారిన నాయుడు గిరీ

-రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు… చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంఓయూల ఛేజింగ్ -రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిన 800 కంపెనీలు -ప్రాసెస్ లోకి వచ్చిన 68 శాతం ఎంఓయూలు -పెట్టుబడుల సాకారానికి నిత్యం కేంద్రంతో సంప్రదింపులు -ఎంఓయూల అమలుకు ప్రత్యేక నోడల్ అధికారులు… జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు -ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మారుతోన్న ఏపీ ముఖ చిత్రం -ఎంఓయూల అమలును నిరంతరం పర్యవేక్షిస్తోన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ప్రాజెక్టులతో ఆర్ధిక కార్యకలాపాలు రెట్టింపు

-ఆర్ధిక వృద్ధి విశ్లేషణకు నెలవారీ నివేదికలు -జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకునేలా సామర్ధ్యాల పెంపు -ఏఐతో పన్నులు, రెవెన్యూ వసూళ్లపై దృష్టి -జీఎస్డీపీ లక్ష్యాలు, కేపీఐపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రాష్ట్రంలోని ఆర్ధిక వృద్ధిని విశ్లేషించేందుకు నెల వారీ నివేదికల్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర- క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెలా నిర్దేశిత తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. నెల, త్రైమాసికం, …

Read More »

ఆన్ లైన్ లో ప్రభుత్వ సేవల వినియోగానికి ప్రత్యేక యాప్

-రూరల్ అన్న క్యాంటీన్లనూ సమర్థవంతంగా నిర్వహించాలి -ప్రతిరోజూ తాగునీటి శాంపిళ్లు తీయాలి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మన మిత్ర ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్ లైన్ లో వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని.. దీంతో పాటు ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. …

Read More »

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో ఉద్యోగం -క్షతగాత్రులకు రూ.10 లక్షల తక్షణ సాయం -వైద్య ఖర్చులన్నీ ప్లాంట్ యాజమాన్యమే భరిస్తుంది -ప్రమాదంపై బొకారో స్టీల్ ప్లాంట్ కి చెందిన త్రిసభ్య కమిటీతో పూర్తిస్థాయి దర్యాప్తు -నివేదిక అనంతరం తదుపరి చర్యలు -కార్మికుల సమస్యలపై త్వరలోనే సమావేశం -విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి …

Read More »

అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో …

Read More »

21న అమరావతిలో జరిగే ‘యోగాంధ్ర’కు బాబా రాందేవ్ హాజరు!

-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 21న జరిగే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతంజలి రాందేవ్ బాబాను ఆహ్వానించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే 25వేల మందిని గ్రూపులుగా విభజించి రాందేవ్ బృందానికి చెందిన వారితోపాటు వివిధ యోగా అసోసియేషన్ల ప్రతినిధులు ఆసనాలు వేయిస్తారని చెప్పారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని …

Read More »

వ‌ర్జినీయా పొగాకు రైతులు, కంపెనీల సమన్వయంతోనే మార్కెట్‌కు స్థిరత్వం

– కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ.. కేంద్ర ప్ర‌భుత్వంతో విస్తృత చర్చలు – ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ ప‌ట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం – రోజువారీ కొనుగోళ్లు 150 బేళ్ల నుంచి 700 బేళ్లకు పెరుగుదల… త్వరలో 1200 బేళ్ల లక్ష్యం – రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్‌కు తీసుకురావాలి: మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి …

Read More »

12 ఏళ్ల ప్ర‌ధాని శ్రీ మోడీ నాయ‌క‌త్వంలో న‌వ భార‌తం

-ప్ర‌ధానిగా రికార్డు దేశ ప్ర‌జ‌ల విశ్వాసానికి ప్ర‌తీక‌ -స‌మ‌ర్ధ నాయ‌క‌త్వంతో దేశ గ‌తిని మార్చిన శ్రీ మోడీ -ప్ర‌ధాని మోడీ రికార్డు దేశానికి హిత‌మ‌న్న వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికైన ప్ర‌ధాన మంత్రుల్లో అత్య‌ధిక కాలం ప‌ద‌విలో ఉన్న ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ బుధ‌వారం రికార్డు నెల‌కొల్పడం న‌వ భార‌త ఆవిష్క‌ర‌ణ‌కు శుభ సూచ‌క‌మ‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. మే 26, 2014న ప్ర‌ధానిగా ప్ర‌మాణం స్వీకారం చేసిన మోడీ …

Read More »

5 లక్షలకు చేరిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు

-రోజురోజుకి పెరుగుతోన్న ఔత్సాహికులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర-2026 రిజిస్ట్రేషన్లు ఐదు లక్షలకు చేరుకున్నాయి. ఈ నెల 7 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా 3 రోజుల వ్యవధిలోనే ఐదు లక్షలకు చేరుకోవడం విశేషం. తొలిరోజు 25వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సోమవారం నుంచి ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. యోగాసనాల్లో కోటి మందిని భాగస్వాములను చేయాలని సీఎం శ్రీ చంద్రబాబు జారీచేసిన ఆదేశాలు అనుసరించి యోగాంధ్ర పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కనిపిస్తోన్న సానుకూల …

Read More »

392 కొత్త వైద్యుల పోస్టింగుల కోసం వెబ్ కౌన్సెలింగ్!

-పారదర్శకత చర్యల్లో భాగంగా తొలిసారిగా అమలు -20వ తేదీలోగా విధుల్లో చేరేలా 12న పోస్టింగు ఉత్తర్వులు -ఎన్. హెచ్. ఎo.నోటిఫికేషన్ ద్వారా నియామకాలు -రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్. చ్. ఎం.) కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ …

Read More »