Breaking News

Daily Archives: July 24, 2026

ఠాగూర్ గ్రంథాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య 136వ జయంతి

-కార్యక్రమానికి హాజరైన అయ్యంకి మనవడు మురళీకృష్ణ, మల్లెతీగ కలిమిశ్రీ -‘మనిషి కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించి, స్వయంగా స్వీట్లు పంచిన అయ్యంకి మురళీకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘పౌర గ్రంథాలయాలే జ్ఞాన దేవాలయాలు’ అనే నినాదంతో ఊరూరా గ్రంథాలయ చైతన్యోద్యమం నడిపిన గ్రంథాలయోద్యమ పితామహుడు, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య అని విశ్రాంత ఆచార్యులు, వెంకట రమణయ్య మనవడు అయ్యంకి మురళీకృష్ణ అన్నారు. అయ్యంకి వెంకటరమణయ్య 136వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ బందరురోడ్డులో గల ఠాగూర్ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారిణి రమాదేవి నిర్వహించారు. ఈ …

Read More »

వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత పాఠశాలలు అన్నింటికీ సొంత భవనాలు

-ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు -ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డులు…రెండేళ్ల కష్టం ఫలించింది -చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం -రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం -రంపచోడవరం మెగా పేరెంట్-టీచర్ మీట్ లో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది లోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం, పాడైన బిల్డింగులను బాగు …

Read More »

పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు

-మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రి -జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ …

Read More »

‘తల్లికి వందనం’తో ఆర్థిక ఊరట

-ప్రభుత్వ స్కూళ్లో మంచి విద్య…నాణ్యమైన భోజనం -సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో ముఖాముఖీలో ఆదివాసీ మహిళలు రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతిబిడ్డకు ఆర్థిక సాయం అందుతుండటంతో తమకు విద్యా ఖర్చుల భారం గణనీయంగా తగ్గిందని గిరిజన మహిళలు అన్నారు. ఈ పథకం తమ పిల్లల చదువుకు ఎంతో అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ …

Read More »

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

-తల్లిదండ్రులు-టీచర్లు కలిస్తేనే విద్యార్థుల విజయం -మెగా పీటీఎంతో విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం -ప్రభుత్వ బడులపై పెరుగుతున్న నమ్మకం -సంక్షేమం విషయంలో రాజీ ప్రసక్తే లేదు -గిరిజనులకు అండగా ఉంటాం… ఆందోళన వద్దు -రంపచోడవరంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ …

Read More »

రాయలసీమ టమాటా మార్కెట్లలో డిమాండ్‌కు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులు

-రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ టమాటా మార్కెట్లలో డిమాండ్ కు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులు నమోదయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాయలసీమ ప్రాంతంలోని పలమనేరు, వి.కోట, పుంగనూరు, మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, కలికిరి, పట్టికొండ, రాప్తాడు (ప్రైవేట్ మార్కెట్), పీపుల్లి (ప్రైవేట్ మార్కెట్) మార్కెట్ యార్డులకు మొత్తం 5,564.91 మెట్రిక్ టన్నుల మొదటి రకం,6,650.17 మెట్రిక్ టన్నుల రెండవ …

Read More »

డ్వాక్రా బజార్ సందర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల ( వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ) అమలు చైర్మెన్ విజయవాడ ఎంజీ రోడ్డులోని బాపు మ్యూజియంలో దేవకీ దేవి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ సందర్శించారు. డ్వాక్రా మహిళలు చేసిన ఉత్పత్తులతో మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండే కాకుండా దేశంలోని 16 రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల వారితో కలిపి 100 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఆ స్టాల్స్ …

Read More »

మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రేపల్లె మండలం పేటేరు గ్రామంలోని ఆంజనేయస్వామి కాలనీలో డ్వాక్రా సంఘ సభ్యురాలు కొఠారి సావిత్రి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) పథకం ద్వారా రూ.10 లక్షల రుణం, అందులో రూ.3.50 లక్షల సబ్సిడీతో ఏర్పాటు …

Read More »

ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన సేవలు అందించేందుకు స్వర్ణ భవిత వనరుల కేంద్రాలు దోహదపడాలి

-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన సేవలు అందించేందుకు స్వర్ణ భవిత వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రేపల్లె మండల కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.29.30 లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ భవిత ప్రత్యేక అవసరాల గల పిల్ల వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,తో కలసి ప్రారంభోత్సవం …

Read More »

జాషువా ఆశయాల బాటలో వైఎస్ జగన్ పాలన : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-​ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి ​-సింగ్ నగర్ జనహిత సదనంలో చిత్రపటానికి నివాళులు -​అవమానాలనే ఆభరణాలుగా మలుచుకున్న మహనీయుడని కొనియాడటం -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఎదురైన ఛీత్కారాలనే సత్కారాలుగా, అవమానాలనే ఆభరణాలుగా మలుచుకుంటూ, మానవత్వమే పరమావధిగా జీవించిన మహోన్నత వ్యక్తి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ​శుక్రవారం నగరంలోని సింగ్ నగర్ జనహిత సదనంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం …

Read More »