Breaking News

డ్వాక్రా బజార్ సందర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల ( వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ) అమలు చైర్మెన్ విజయవాడ ఎంజీ రోడ్డులోని బాపు మ్యూజియంలో దేవకీ దేవి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ సందర్శించారు. డ్వాక్రా మహిళలు చేసిన ఉత్పత్తులతో మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండే కాకుండా దేశంలోని 16 రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల వారితో కలిపి 100 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఆ స్టాల్స్ ని లంకా దినకర్ సందర్శించి లక్ష్మీ దేవి పటానికి పూజలు చేయడం జరిగింది.

లంకా దినకర్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ జీ సంకల్పం వికసిత్ భారత్ లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అనుసంధానం ద్వారా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు పైగా ఆదాయం వచ్చే లాక్ పతి దీదీలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు దేశంలో 3 కోట్ల మంది లాక్ పతి దీదీలను దేశంలో ఉద్భవించేలా కృషి చేశారు, ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి 21.15 లక్షల మంది మహిళలలు ఉన్నారు. అదే స్ఫూర్తితో దేశంలో 2029 నాటికి 6 కోట్ల మంది లాక్ పతి దీదీలు గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో మన రాష్ట్రం వాటా కనీసం 45 లక్షల మహిళలు లాక్ పతి దీదీలుగా దేశానికి అందించాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అందించే ముద్ర రుణాలు, పీఎంఈజీ మరియుసూక్ష్మ పరిశ్రమల రుణాలు, డ్వాక్రా మహిళల కోసం రుణాలు ద్వారా మహిళల ఆర్ధిక స్వావలంబన సాధ్యం అవుతుంది, డ్వాక్రా మహిళల గ్రూపులను దేశంలోనే మొదటి సారి ప్రోత్సహించి ఈరోజు దేశంలో ఇంత పెద్ద ఎత్తున మహిళ సాధికారతకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందనీయులు. సామాన్య మహిళలను లక్షాధికారులుగా చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ జీ చరిత్రలో నిలుస్తారు అని లంకా దినకర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *