-తరతరాల మానవ జాతికి స్ఫూర్తిదాయకం -వామపక్ష భావజాలం విస్తృతం -లెనిన్ శత వర్థంతి ముగింపులో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గానికి, ప్రజానీకానికి లెనినిజం అజేయంగా నిలిచిందని, పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలకు సోషలిస్టు రాజ్యనిర్మాత విఐ లెనిన్ ఒక స్ఫూర్తిదాయకమని వక్తలు ఉద్ఘాటించారు. ప్రపంచ ప్రప్రథమ సోషలిస్టు రాజ్య నిర్మాత, విప్లవ యోధుడు కామ్రేడ్ విఐ లెనిన్ శత వర్థంతి ముగింపు (101) సందర్భంగా మంగళవారం విజయవాడ లెనిన్ సెంటరులోని లెనిన్ …
Read More »Latest News
అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభానికి ముందే నగరంలోని ప్రధాన రహదారులను ట్రాఫిక్ రద్దీకి తగిన విధంగా సిద్దం చేసుకోవాలని, ట్రాఫిక్, రైల్వే, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంభర్ లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ శానసభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి , జిఎంసి, రైల్వే, ఆర్&బి, ట్రాఫిక్ పోలీస్ …
Read More »సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నింటిని వేగవంతం చేయాలని, నోడల్ అధికారులు కార్యదర్శులు చేస్తున్న సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అడ్మిన్ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు సచివాలయాల కార్యదర్శులు మరియు నోడల్ అధికారులతో సమావేశం నిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ తొలుత కార్యదర్శుల వారీగా మిస్సింగ్ సిటిజెన్స్, పి.ఏ.సి.యస్, హౌసింగ్ జియో ట్యాగ్, యన్.పి.సి.ఐ, …
Read More »మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు తీసుకోవాలని, మైక్రో పాయింట్స్ వారీగా పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు పారిశుధ్య పనులు జరిగేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నాజ్ సెంటర్ రిజర్వాయర్ లోని మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసి, కార్మికులు, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. …
Read More »పేదలకు ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర
-జగనన్న కాలనీల సందర్శనలో మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ.. వారికి నిలువ నీడ లేకుండా చేస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. నున్న, సూరంపల్లిలోని జగనన్న లేఅవుట్ లను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. త్రాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గృహ యజమానులు మల్లాది విష్ణు వద్ద వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. బస్సు …
Read More »దేవస్థానంలో వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీ చేయాలి
-సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వాయిద్య కళాకారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నారావు ఆంధ్రప్రదేశ్ సంగీత వాయిద్య కళాకారుల సంఘం నూతన అధ్యక్షురాలిగా ఎస్ …
Read More »పేదల సాగులో ఉన్న భూములకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి.
-దేవాదాయ భూముల్లో నివాసముంటున్న నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. -రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తరతరాల నుండి అంతర్వేది దేవస్థానం భూములను సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, శ్రీ …
Read More »రాష్ట్రంలో నూతన విద్యా విధానం పై ప్రాంతీయ సదస్సు లో మేధోమథనం
– విద్యార్థుల్లో సృజనాత్మకత జోడించే సంస్కరణల దిశగా అడుగులు – ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మానవ వనరులు అధికారులు, హెచ్ ఎం లతో సమావేశం – హాజరైన తూర్పు, కోనసీమ, కాకినాడ జిల్లా కలెక్టర్లు – విజయ రామరాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్టంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఫలవంతమయ్యే సూచనలతో ముందుకు రావాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ రామరాజు అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో పాఠశాలల …
Read More »వీధి దీపాల కోసం నగరపాలక సంస్థ వారి స్కై లిఫ్ట్ వెహికల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర వీధి దీపాలను అమర్చేందు, మరమ్మతులు చేసేందుకు సులభతరంలో చేసే స్కై లిఫ్ట్ వాహనాన్ని విజయవాడ నగర పాలక సంస్థ వారు 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్నారని ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్కై లిఫ్ట్ వాహనం, హై మాస్ట్ లైట్స్, ప్రధాన రహదారులు జాతీయ రహదారులలో ఉన్న వీధి దీపాలను అమర్చటం లేదా మరమ్మతులు చేయటం లాంటి వాటికోసం ఆధునిక వాహనం ద్వారా చేపట్టడం వల్ల …
Read More »పన్ను చెల్లింపులు ఇప్పుడు మరింత సులభం
-ఆన్లైన్ చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ పేమెంట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు సకాలంలో సులభంగా పన్ను చెల్లించుటకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల ఉన్న క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పన్ను కట్టేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్పారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. విజయవాడ నగర పరిధిలో గల క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ ప్రజలు క్యూ లైన్ లో …
Read More »