మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు, సతీమణి శీరిష దంపతులు సోమవారం తమ స్వగ్రామమైన ఐతవరం గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులను పేరు పేరునా అప్యాయంగా పలకరిస్తూ ప్రశాంత వాతావరణం లో అందరం కలిసి ఎన్నికలు జరిగేలా సహకరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు రాగా ఈవియం లో సాంకేతిక సమస్య ఏర్పడటం తో దాదాపు 50 నిమషాల పాటు అక్కడే నీరిక్షించి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్బంగా గ్రామస్తులను పేరు పేరునా పలకరిస్తూ తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో తన క్లాస్మెట్ లతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం ఓటు హక్కును వినియోగించుకుని మైలవరం నియోజకవర్గం లో జరుగుతున్న ఓటింగ్ ప్రచార సరళిని పరిశీలించడం కోసం వెళ్ళారు.
Prajavartha Online Telugu News