Breaking News

Daily Archives: September 20, 2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ప్రకృతితో మమేకమైన అభివృద్ధికే భవిష్యత్తు

-గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు పడాలి -ప్రతి భవనం వనరులను సృష్టించేలా ఉండాలి -అభివృద్ధి ఆగకూడదు… పర్యావరణానికి గాయం చేయకూడదు -బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ది ఎర్త్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతికి ప్రాధాన్యమిస్తూ, భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నిర్మించిన ది …

Read More »

విద్యార్థుల్లో స్ఫూర్తినింపిన భారతీయం

-108 మంత్రాలతో భారతమాతకు పుష్పాంజలి, హారతులు -భారతీయ సంస్కృతి, దేశభక్తి, సేవాభావం, సైనికుల త్యాగాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా కొనసాగిన ‘భారతీయం’ కార్యక్రమం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లా తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. సత్సంగంలో మంత్రి నారా లోకేష్‌కు చాగంటి కోటేశ్వరరావు …

Read More »

స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు… అది మన వారసత్వ సంపద

-స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం -వారు నడయాడిన ప్రదేశాలను సందర్శిస్తే దేశభక్తి పెరుగుతుంది -త్యాగధనుల జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి -భారతీయం కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కాకినాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు… అది మన భారతీయుల వారసత్వ సంపద అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని …

Read More »

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం -దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది -త్యాగధనులే మన మార్గదర్శకులు.. వారి బాటలో పయనిద్దాం -విలువలతో ఎదగండి.. తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవండి -చిన్నచిన్న సమస్యలకే కుంగిపోవద్దు… ఎదురొడ్డి పోరాడాలి -భారతీయం కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి …

Read More »

విజయవంతంగా జరిగిన హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు.

-200 మందికి పైగా రోగులకు వైద్య సేవలు -ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి రెండు నెలలకోసారి రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో షుగర్, బిపి, ఫిట్స్, పక్షవాతం జబ్బులకు ప్రతి రెండు నెలలకు మూడవ ఆదివారం నాడు నిర్వహించబడుతున్న హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు నేడు అనగా సెప్టెంబర్ 20 (ఆదివారం) నాడు పాయకాపురం, లహరి …

Read More »

ప్రమోటర్ల ఎత్తుగడలకు ఇక చెల్లుచీటి

-కేతనకొండ ప్లాట్ ఓనర్ల మహాజనసభలో కీలక తీర్మానాలు -రెరా ఆదేశాలు అమలు చేయకపోతే న్యాయపోరాటమే -825 కుటుంబాలను కాపాడాలని డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సమీపంలోని కేతనకొండ శ్రీహరిపురం ప్రభుత్వ ఉద్యోగుల కోఆపరేటివ్ కాలనీ వ్యవహారంలో ప్లాట్ ఓనర్లు ఇక వేచి చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జీవితకాల కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో ముందుకొచ్చిన ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన కుటుంబాలు తమ ప్లాట్ల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పరిస్థితిపై ఆదివారం సెప్టెంబర్ 20న …

Read More »

రహ్మత్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో వివిధ గణనాథులను దర్శించుకున్నజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్, మరియు వీడియోగల్లీలో ఏర్పాటు చేసిన వివిధ గణేష్ మండపాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని.. నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత మరియు భక్తులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “గడపగడపకు కాంగ్రెస్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 73వ మరియు 74వ డివిజన్లలో “గడపగడపకు కాంగ్రెస్” కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా సచివాలయం సమీపంలోని 6వ బ్లాక్ మరియు …

Read More »

టీడీపీ కార్యాలయంలో కొలువుదీరిన గణనాథున్ని దర్శించుకున్న దేవినేని ఉమా

-స్థానిక నేతలతో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో భక్తి వాతావరణం నెలకొంది. గణనాథుడి దర్శనానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు …

Read More »