Breaking News

Daily Archives: September 17, 2026

దేశ ప్రయోజనాల కోసం మోదీకి అండగా నిలవాలి

-ఎన్డీయే ఐక్యతే దేశానికి బలం -మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి అన్ స్టాపబుల్ -VKS… ఇదే భారత్ అభివృద్ధి మంత్రం -అయోధ్య రామమందిర నిర్మాణ కలను మోదీ నిజం చేశారు -దేశంలో నదుల అనుసంధానం ప్రధాని మోదీతోనే సాధ్యం -వామపక్ష తీవ్రవాదాన్ని అంతమొందించారు… ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా చాటారు -యూపీ ప్రభుత్వం అనుమతిస్తే అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణం -వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి -ముఖ్యమంత్రి ప్రసంగానికి రక్షణ మంత్రి ఫిదా… వెరీ వెల్ అంటూ ప్రశంసలు -సీఎం …

Read More »

దేశానికి ఆహార భద్రత అందించిన గొప్ప నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

-ఈ వారంలోనే రాయితీపై ఉల్లి ప్రజలకు అందజేస్తాం -ఆశీర్వాద కా దియా కార్యక్రమంలో దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోడీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 140 కోట్ల భారతీయులకు ఆహార భద్రతను అందించిన గొప్ప దార్శనిక నేత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

-ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు జిల్లా -పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కలిసి ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రానికి, దేశానికి అత్యంత కీలకమైనదని …

Read More »

సెర్ప్ ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలకు భరోసా

– డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే లక్ష్యం – బ్యాంకు రుణాలు, బీమా రక్షణపై మంత్రి కొండ‌ప‌ల్లి స‌మీక్ష‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడలోని ఎన్‌టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ …

Read More »

19న విశాఖలో ఇళ్ల పట్టాల పండుగ

-ఒకేసారి 25,880 కుటుంబాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ -త్వరలో విజయవాడలోనూ 24 వేల కుటుంబాలకు హక్కుల కల్పన -జీవో నెంబర్ 30 ద్వారా ఇప్పటికే 12 వేల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ -ఒక్క మంగళగిరిలోనే 5 వేల కుటుంబాలకు లబ్ది -పేద ప్రజల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి మరో నిదర్శనం : రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం విశాఖ …

Read More »

విశ్వకర్మ స్ఫూర్తితో కూటమి పాలన

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : సువర్ణ లంకా నగరం, ద్వారక, ఇంద్రప్రస్థం వంటి అద్భుత నగరాలను నిర్మించిన విరాట్ విశ్వకర్మ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేతి వృత్తుదారులకు ఆర్థిక మేలు కలిగేలా పథకాలు రూపొందిస్తూ, అభినవ విశ్వకర్మగా రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను సీఎం చంద్రబాబునాయుడు నిర్మిస్తున్నారన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి …

Read More »

రాష్ట్రంలో క‌క్ష సాధింపులు లేని నిజాయితీ పాల‌న‌

-సీఎస్ఆర్ తో చేయూత అభినంద‌నీయం -దేశాన్ని ఆర్థిక శ‌క్తిగా నిలిపింది ప్ర‌ధాని మోడీనే -ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో క‌క్ష సాధింపులు లేని నీతి, నిజాయితీ క‌లిగిన కూట‌మి పాల‌న సాగుతుంద‌ని ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. శ్రీశైలంలో గురువారం ప‌ర్య‌టించిన మంత్రి గొట్టిపాటి వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ముందుగా శ్రీశైల మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్నారు. బొండాడ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సున్నిపెంట‌లో సుమారు రూ.40 ల‌క్ష‌ల …

Read More »

ఎల్‌ నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ డిమాండ్‌

-290 మిలియ‌న్ యూనిట్ల‌కు చేరిన వినియోగం -ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు -ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ఇంధ‌న‌శాఖ‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ అంత‌రాయాలు, ఇత‌ర‌ స‌మ‌స్య‌లు లేకుండా ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా అన్ని చ‌ర్య‌లూ చేప‌డుతున్నామ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి గురువారం మంత్రి గొట్టిపాటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గతేడాది ఇదే సీజన్‌లో 200 మిలియన్ …

Read More »

ప్రజా సమస్యలపై ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి ఆరా

-అద్దంకిలోని పలు కాలనీల్లో సుడిగాలి పర్యటన -సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణంలోని పలు కాలనీల్లో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గురువారం సుడిగాలి పర్యటన జరిపారు. ప్రజలతో ముఖాముఖి అయి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అద్దంకి పట్టణంలోని బట్టి బడి, గుర్రాల కాలనీ, బోడెంపూడివారి పాలెం, బలిజపాలెం కాలనీలతో పాటు జూనియర్‌ కాలేజీ ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతులపై …

Read More »

అభివృద్ధి బాటలో అద్దంకి

-విద్యుత్ సబ్‌స్టేషన్, అగ్నిమాపక కేంద్రం -హోం మంత్రితో క‌లిసి ప్రారంభించిన ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌వ‌ర్గం అభివృద్ధిలో దూసుకు పోతోంది. నియోజకవర్గ అభివృద్ధిలో గురువారం మరో కీల‌క‌ ముందడుగు పడింది. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అద్దంకి ఎన్ఎస్పీ కాల‌నీలో రూ.7.72 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనితలు …

Read More »