Breaking News

Daily Archives: September 17, 2026

చేతి వృత్తుల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి

-విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేతివృత్తుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. విశ్వకర్మ జయంతి వేడుకలు మరియు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు గురువారం భవానిపురం, పున్నమి ఘాట్ , బోధ సిరి టూరిజం బోట్ లో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకుడు, బీ సీ ఫైనాన్స్ కార్పొరేషన్ …

Read More »

25 ఏళ్ల నిస్వార్థ సేవ ప్రధాని మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, కృష్ణమ్మ ఒడిలో దుర్గా ఘాట్ వద్ద ప్రత్యేక జల హారతుల కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని జన్మదినం సందర్భంగా దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ,విజయం కోసం ఇంటింటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపునివ్వడంతో మాజీ కేంద్ర మంత్రి విజయవాడ , పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో …

Read More »

దేశానికి వెలుగులు పంచుతున్న ధ్రువతార నరేంద్ర మోదీ : గద్దె అనురాధ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశాని మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించి దేశానికి వెలుగులు పంచుతున్న ధ్రువతార ప్రధాని నరేంద్ర మోదీ అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. గురువారం రాత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ తన నివాసంలో దీపాలు వెలిగించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ విభిన్న …

Read More »

ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమం

-ప్రతి గురువారం ఉచిత మానసిక ఆరోగ్య సెషన్స్ -జిల్లా కలెక్టర్ చొరవతో ఆకర్ష ఫౌండేషన్ భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ చొరవతో ప్రత్యేక మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం జిల్లా క్యాంపు కార్యాలయంలో ఉద్యోగుల కోసం ఒత్తిడి నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు ఎదుర్కొనే పని ఒత్తిడిని గుర్తించడం, నియంత్రించడం, మానసిక సమస్యలను …

Read More »

కొండ ప్రాంతాల ప్రజల సంక్షేమానికి కొండంత భరోసా!

– పున‌రావాసం, భ‌ద్ర‌త‌, జీవ‌న ప్ర‌మాణాలు, గృహ వ‌స‌తుల‌పై ప్ర‌త్యేక దృష్టి – స‌వాళ్ల‌ను అధ‌గ‌మించి సుస్థిర స‌మాజ నిర్మాణం వైపు ముంద‌డుగు – మేధోమ‌థ‌నానికి వేదిక‌గా ఎస్‌పీఏలో ప్ర‌త్యేక స‌మావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల క్షేమం, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల‌, పున‌రావాసం, ప‌ట్ట‌ణ గృహ వ‌స‌తుల‌పై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముంద‌డుగు వేయాల‌ని ప్ర‌ముఖులు పిలుపునిచ్చారు. ప్రజలకు సురక్షితమైన, సుస్థిరమైన నివాస వసతి కల్పించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. గురువారం న‌గ‌రంలోని …

Read More »

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి

-పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, నోటీసుల విచారణను అక్టోబర్ 5లోపు పూర్తి చేయాలి -అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురణ -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. …

Read More »

చందర్లపాడులో ఈ నెల 18న ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం

-నందిగామ నియోజకవర్గ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి* -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక నెల – ఒక నియోజకవర్గo – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. చందర్లపాడు తునికిపాటి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10.00 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గ …

Read More »

ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్య పరిరక్షణకు భరోసా

-జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం.. 515 మందికి వైద్య పరీక్షలు -ప్రజలకు ఉచిత ఓపీ, ఐపీ సేవలు అందిస్తున్నాం -ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.పి.జగదీష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని “రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం” అనే నినాదంతో ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన, ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.పి.జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గురువారం సత్యనారాయణపురం శ్రీ …

Read More »

కలెక్టరేట్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మ‌స్త విశ్వానికి దివ్య వాస్తుశిల్పి శ్రీ విరాట్ విశ్వకర్మ భ‌గ‌వాన్ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జ‌రిగిన‌క కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్యం, సృజనాత్మకత, శ్ర‌మ‌, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విలువలు విశ్వకర్మ జయంతి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంప్రదాయ కళలు, కళాకారుల క్షేమం, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని.. విశ్వకర్మ …

Read More »

కెనడా వేదికపై జిల్లా కీర్తి చాటేందుకు సిద్ధం..

– జిల్లా క్రీడాకారుని అంతర్జాతీయ లక్ష్యానికి పీ4 అండ – కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ చొర‌వ‌తో మార్గ‌ద‌ర్శి ద్వారా ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కెన‌డాలో జ‌ర‌గ‌నున్న కామ‌న్వెల్త్ ప‌వ‌ర్ లిఫ్టింగ్ ఛాంపియ‌న్‌షిప్‌న‌కు ఎంపికైన జి.కొండూరు మండ‌లం, వెంక‌టాపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు సంకు కృపారావు అంతర్జాతీయ వేదికపై మరోసారి పతకం సాధించి ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అవ‌స‌ర‌మైన ఆర్థిక సహాయం కోసం …

Read More »