Breaking News

Daily Archives: September 18, 2026

రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక

-నూతన అసెంబ్లీ భవనంపై ఎత్తైన స్పియర్ నిర్మాణానికి ఆమోదం -రెండో దశలో ఎకరం కంటే తక్కువున్న రైతులకు యాన్యుటీ -సీఎం చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పరిధిలో ప్రజా రవాణా కోసం ఓ మాస్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఓ ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని అన్నారు. సచివాలయంలో …

Read More »

పోర్టు ఇన్‌ఫ్రా ఎకో సిస్టమ్‌గా ఆంధ్రప్రదేశ్

-రాష్ట్రంలో హార్డ్‌వేర్ తయారీ హబ్ ఏర్పాటుపై దృష్టి -రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం -28 ప్రాజెక్టులతో 19,739 మందికి ఉద్యోగాల కల్పన -జిల్లాల ఎగుమతుల ర్యాంకింగ్‌లో దేశంలోనే 10వ స్థానంలో తిరుపతి -సీఎం చంద్రబాబు అధ్యక్షతన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను కీలకమైన హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు… తీర ప్రాంతం పొడవునా పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి …

Read More »

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌

-ఎండీఎల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం -ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ -రూ.15,000 కోట్ల పెట్టుబడి… 45 వేల మందికి ఉపాధి అవకాశాలు -ఏడాదికి 12 లక్షల టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో రైతులు, కౌలు రైతులను ఆదుకోండి

-సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం కలిసి పలు అంశాలపై రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాల్లో తాము పర్యటించామని తెలిపారు. ఎల్‌నినో కారణంగా తలెత్తిన కరువు పరిస్థితులను సాధారణ ప్రకృతి వైపరీత్యంగా కాకుండా అత్యవసర …

Read More »

గుంటూరు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు భేటీ

-హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు సాయిబాబా రోడ్డు, వినాయక నగర్ లో శుక్రవారం సాయంత్రం గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ విందు భేటీకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు …

Read More »

స్థానిక ఎన్నికలపై ఎన్డీఏ కూటమి కసరత్తు

-క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ -కూటమి సమన్వయమే కీలకం.. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ -పల్లా శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్‌ రిసార్టులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, బీజేపీ …

Read More »

విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటిపట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది…తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా! ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు…ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం …

Read More »

రేపు విశాఖలో ఆవిష్కృతం కానున్న చారిత్రక ఘట్టం

-రూ.8,874 కోట్ల విలువైన భూమిపై సంపూర్ణ హక్కులతో పట్టాలివ్వనున్న సీఎం -28,445 కుటుంబాలకు ఇంటి హక్కు -399 ఎకరాల్లో 19,33,853 చదరపు గజాల క్రమబద్ధీకరణ -40 ఏళ్ల పెండింగ్ సమస్యకు పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం -విశాఖలో రేపు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలన్న కలను సాకారం చేసేందుకు విశాఖ వస్తున్నా అంటూ సీఎం ట్వీట్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం …

Read More »

అసెంబ్లీ (ఐకానిక్ భవనం) నిర్మాణానికి రూ.661 కోట్లకు పరిపాలనామోదం

-మలి విడత ల్యాండ్ పూలింగ్ రైతులకు కనీస కౌలు రూ. 40వేలు -రాష్ట్ర మంత్రి పి.నారాయణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నడిబొడ్డున అత్యంత ఎత్తైన భవన నిర్మాణాల్లో ఒకటైన అసెంబ్లీ(ఐకానిక్ భవనం) స్పైర్(250 మీటర్లు) నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రూ.661 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వడం జరిగిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 66వ సీఆర్డీఏ అథారిటీ సమవేశం వివరాలను ఏపీ సచివాలయం లోని ప్రచార విభాగంలో శుక్రవారం …

Read More »

కేప్‌టౌన్‌లో భారత స్వరం

-సదస్సులో డా. దగ్గుబాటి పురందేశ్వరి ప్రత్యేక భాగస్వామ్యం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై విస్తృత చర్చకు వేదికగా నిలిచిన 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం చురుకైన పాత్ర పోషించింది. ఈ అంతర్జాతీయ సమావేశంలో భారత ప్రతినిధి బృందంలో లోక్‌సభ సభ్యురాలు డా. దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సదస్సు ప్రధాన ఇతివృత్తం “Strengthening International Law and Parliamentary Democracy in a Changing World Order: …

Read More »