అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది…తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు…ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం.
ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు… 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది…
భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది…..
బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది…
ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది.
దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.
సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో….సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నాం.
Prajavartha Online Telugu News