-స్థానిక నేతలతో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో భక్తి వాతావరణం నెలకొంది. గణనాథుడి దర్శనానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని దేవినేని ఉమ ఆకాంక్షించారు. రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగాలని గణనాథుడిని ప్రార్థించారు.
Prajavartha Online Telugu News