Breaking News

Daily Archives: September 4, 2026

విజయవాడ విమానాశ్రయ అభివృద్ధిపై ఏపీ ఛాంబర్స్‌తో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఇంటరాక్టివ్ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఆధ్వర్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డితో నేడు విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ, పారిశ్రామికాభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఏపీ ఛాంబర్స్ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి కోసం ఛాంబర్స్ అనేక సంవత్సరాలుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. …

Read More »

నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్

-తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారు, నిడదవోలు పట్టణంలోని మదన గోపాలస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ -సాంప్రదాయ పంచకట్టులో దర్శనమిచ్చిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో ఉత్సాహంగా గడిపిన మంత్రి దుర్గేష్.. -రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణభగవానుడు, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కాంక్షించిన మంత్రి దుర్గేష్ -నిడదవోలును నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, …

Read More »

తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి గా ఎం.యు.వి. మనోహర్ బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి (D.P.T.O.)గా ఎం.యు.వి. మనోహర్ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని డి.పి.టి.ఓ. ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మనోహర్‌కు ప్రజా రవాణా రంగంలో విస్తృతమైన అనుభవం ఉంది. గతంలో రాజమహేంద్రవరం అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్)గా విధులు నిర్వహించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, అమలాపురం, కాకినాడ డిపోలలో డిపో మేనేజర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడ డి.పి.టి.ఓ.గా విధులు నిర్వహిస్తూ, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా డి.పి.టి.ఓ.గా నియమితులై బాధ్యతలు …

Read More »

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం అన్న వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, తంగిరాల రామిరెడ్డి,మాగంటి నవీన్, మునగ శేషు, బిక్షాలు రెడ్డి,గద్దె కళ్యాణ్, సాయి కృష్ణా రెడ్డి, బాలరాజు …

Read More »

శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లోను ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు (బి.ఎల్.ఓ) ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల …

Read More »

శాఖాపరమైన దర్యాప్తు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా, కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న మీడియా కథనాలపై పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది. ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈఓ విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. …

Read More »

సాగు నీటి సంరక్షణ… పర్యావరణ పరిరక్షణ… అహ్లాదకర వాతావరణం

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ -రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ -ఇప్పటికే 26 చెరువులకు పునరుజ్జీవం -భూగర్భ జలాల పెంపు.. సమగ్ర అభివృద్ధే ధ్యేయం -ఆధునిక హంగులతో ఆహ్లాదకర కేంద్రాలుగా చెరువులు -వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు, చిల్డ్రన్ పార్కులతో కొత్త రూపు -సెప్టెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాగు నీటి వనరుల సంరక్షణ నుంచి పర్యావరణ …

Read More »

రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌దే

-కాలుష్యం చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు.. పన్ను మాత్రం ఎగ్గొడుతున్నారు.. -ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యింది -పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు? -తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా మీ నుంచి స్పందన లేదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం …

Read More »

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

-10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ -శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు -అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం -భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు -భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా నియోజక వర్గంలోని ఆడపడుచులతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని …

Read More »

తరిగొప్పలకు రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులు: యార్లగడ్డ

-రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన తరిగొప్పల–మానికొండ రోడ్డుకు ప్రారంభం -రూ.27.30 లక్షలతో 7 సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే -మైనస్ వచ్చిన గ్రామాలకూ వివక్ష లేకుండా అభివృద్ధి: యార్లగడ్డ -77 వేల మందికి ఇంటింటికీ ఉచిత రక్తపరీక్షలు నిర్వహించాం -రూ.100 కోట్ల నిధులకు సీఎం, పవన్, లోకేశ్‌కు యార్లగడ్డ కృతజ్ఞతలు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ అభివృద్ధి విషయంలో ఓట్లు, రాజకీయాలకు తావు లేదని, ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే …

Read More »